Chiranjeevi Sandeep Vanga: హిట్టా పట్టా తర్వాత సంగతి.. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే డైరెక్టర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. అంత పవర్ ఫుల్ గా ఉంటాయి ఆయన చేసే సినిమాలు.. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ ఎప్పుడైతే రీఎంట్రీ ఇస్తున్న అని అనౌన్స్ చేశారో.. అప్పటినుంచి ప్రతి దర్శకుడు చిరు కోసం కథలు రాయడం మొదలుపెట్టారు.. దీనికి తోడు మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నారు.. అందుకే చాలా మంది డైరెక్టర్లు మెగాస్టార్ కి కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా కూడా మంచి కథ రాశాడట..!!
అయితే చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా తాను సినిమా చేస్తానని.. చిరుకి కథ చెప్పడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడట సందీప్. మెగాస్టార్ ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం మరో వైద్య సినిమాతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.. సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాను 5 కోట్లతో నిర్మిస్తే.. ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది.. అర్జున్ రెడ్డి సినిమా తో సందీప్ టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాడు.. అప్పట్లో శివ సినిమా ఎలాగో.. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా అలాగా.. మరి అలాంటి దర్శకుడి చిరుతో సినిమా చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది.. ఈ యంగ్ డైరెక్టర్ తో చిరు సై అంటారో లేదో వేచి చూడాలి.