ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chiru Sanjeevani: జై చిరంజీవ.. జైజై చిరంజీవ.. చరణ్ అర్జున్ స్పెషల్ సాంగ్..!!

Share

Chiru Sanjeevani: మెగాస్టార్ చిరంజీవి సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చిరు చారిటబుల్ ట్రస్ట్ లో భాగంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలు నిరంతరం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఇది చూసి చలించిపోయిన చిరంజీవి ఇటీవల ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు.. చిరంజీవి చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీతదర్శకుడు గాయకుడు చరణ్ అర్జున్ “చిరు సంజీవని” టైటిల్ తో ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించారు..

Chiru Sanjeevani: special song singing by Charan Arjun
Chiru Sanjeevani: special song singing by Charan Arjun

ఎవరన్నారు నువ్వు చిరంజీవని.. ఇప్పుడు నువ్వే మా సంజీవని.. అంటూ సాగే ఈ పాటను చరణ్ అర్జున్, నాగ దుర్గ పాడారు. జై చిరంజీవ.. జైజై చిరంజీవ.. సేవకు నువ్వు ఎప్పుడో వేసావు తోవ.. అంటూ సాగే ఈ పాట మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.. ఈ పాటను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.. చిరంజీవి నటుడిగా కెరీర్ ప్రారంభించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాల గురించి ఈ పాట ద్వారా అందరికీ తెలియజేశారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది.. చరణ్ అర్జున్ ఇటీవల సోనూసూద్ చేసిన సేవలకు కూడా ఒక స్పెషల్ సాంగ్ ఆలపించారు..


Share

Related posts

Nimmagadda : మంత్రి కొడాలికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్ …

somaraju sharma

Power Bill : ఆ కరెంటు బిల్లు చూసి బి.పి తో హాస్పిటల్లో చేరిన వృద్ధుడు..! ఇది మరీ అన్యాయం….

siddhu

Benelli 320 R : ఇటాలియన్ బ్రాండ్ బెనెల్లి 320 ఆర్ బైక్ ఫీచర్స్ చూసేయండి..

bharani jella