NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏకంగా ఐపీఎల్ కే తాకిన వంటలక్క సెగ..! మెసేజ్ లతో గంగూలీ చచ్చిపోతున్నాడు

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సీరియల్ ఏదైనా ఉంటే మరో ఆలోచన లేకుండా అందరూ ‘కార్తీక దీపం’ పేరే చెబుతారు. దీనిని టెలివిజన్ బాహుబలి అని కూడా అనొచ్చు. అంత పాపులర్ అయిపోయింది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో వంటలక్కకి ఉన్న ఫాలోయింగ్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

 

News18 Telugu - IPLకి కార్తీక దీపం సెగ.. టైమ్ మార్చాలంటూ సౌరవ్ గంగూలీకి  రిక్వెస్ట్.. | Karthika Deepam effect on IPL and a guy requested Ganguly to  change match timings pk- Telugu News, Today's Latest వంటలక్క దెబ్బకి రికార్డులు బద్దలు అయిపోతున్నాయి.స్టార్ మా కి ఒంటి చేత్తో భారీగా రేటింగ్స్ తీసుకొస్తుంది. ఆమె జోరు తట్టుకోవడం కొత్త కొత్త సినిమాల వల్ల కూడా కావడం లేదు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే రాత్రి 7:30 అయిందంటే చాలు ఆడాళ్లంతా పనులు పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చుంటారు. అదీ ప్రతి ఒక్క ఎపిసోడ్ కనీసం 18 తగ్గకుండా రేటింగ్ తీసుకొని వస్తుందంటే రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ వల్లనే మాటీవీ ఛానెల్ నే నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది అంటే అతిశయోక్తి కాదు. 

ఇలాంటి సమయంలో ఐపీఎల్ రాబోతోంది ఐపీఎల్ 13వ సీజన్ మొదటి మ్యాచ్ రాత్రి 7:30 కి మొదలవుతుంది. భారతదేశంలో ఐపీఎల్ జరిగినప్పుడు 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ లు ఇప్పుడు దుబాయ్ కి లీగ్ షిఫ్ట్ కావడంతో ఆ అరగంట ముందే మొదలు కాబోతున్నాయి. దీంతో మహిళలంతా ఎట్టిపరిస్థితుల్లో కార్తీకదీపం మిస్ కారు సీరియల్ కాబట్టి కుర్రాళ్ళు, క్రికెట్ అభిమానులు అంతా రిమోట్ కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. 

ఇలాంటి సమయంలో ఐపీఎల్ పెడితే ఇంట్లోని ఆడవారి చేతిలో వారి సంగతి అంతే. ఇక ఆ టైంకి బ్రహ్మదేవుడు దిగివచ్చినా ఇంట్లో ఆడాళ్ళు రిమోట్ ఇచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి తాజాగా ఐపీఎల్ టైమింగ్ మార్చాలంటూ ఒక యువకుడు ఏకంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ని రిక్వెస్ చేస్తూ ట్వీట్ వేసాడు. మా ఇంట్లో ఒకటే టీ.వి ఉంది. రాత్రి 7:30 కి కార్తీకదీపం సీరియల్ వస్తుంది కాబట్టి కనికరించి ఐపీఎల్ టైమింగ్ మార్చండి సార్…. లేకపోతే మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అని ట్విట్ చేశాడు. దీనికి ‘స్టార్ మా’ కూడా రిప్లై ఇచ్చింది.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!