Chocolate: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి డిప్రెషన్ వలలో చిక్కుకుంటాన్నారు.. ఆఫీస్ లో పని ఒత్తిడి, ఇంట్లో పని, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతున్నారు.. ఈ సమస్యను అధిగమించాలంటే డార్క్ చాక్లెట్ తినాలని చాలా మందికి తెలుసు.. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలో తెలీదు.. ఈ విషయం పై పరిశోధనలు చేసిన పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు..!!
కొరియా రీసెర్చర్స్ అధ్యయనాల ప్రకారం.. 85 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ను పది గ్రాముల చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకున్న 46 మంది పై రీసెర్చ్ జరిపాక ఈ విషయాలు తెలుపుతున్నారు వారిలో 20 రకాలైన మానసిక స్థితిగతులను పరిశీలించారు. డార్క్ చాక్లెట్ తినడం వలన శారీరక మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చాయని వారు గుర్తించారు డార్క్ చాక్లెట్లు తినడం వలన మూడ్ లో వచ్చే మార్పులు, గట్ మైక్రోబయోటెక్ కు మధ్య ఉన్న సంబంధాలను కూడా వారు పరిశీలించారు.
85 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తిన్నవారిలో నెగిటివ్ మూడు తగ్గినట్లు వారు గుర్తించారు. అదే 75 శాతం కోకో చాక్లెట్ తీసుకున్న వారిలో పెద్దగా మార్పు గమనించలేదు. 85 శాతం డార్క్ చాక్లెట్ అంటే అందులో 85 శాతం కోకో ఉంటుంది. మిగతా పదిహేను శాతం పంచదార, వెనీలా, ఇంకా ఇతర ఫుడ్ ఎసెన్షియల్స్ ఉపయోగిస్తారు. అంటే పాలు ఎక్కువగా ఉన్న చాక్లెట్స్ తినకూడదు. కోకో ఎక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. వీటిని కూడా పది గ్రాముల మోతాదులో రోజుకు మూడు సార్లు తింటే మానసిక ఒత్తిడి తగ్గి హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తారట. కోకో లో ఉండే ఫైబర్, ఐరన్ యే కారణం. మరి ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి కోకో ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ ఎంచక్కా లాగించేయండి.. టెన్షన్ ఉఫ్..
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…