Coffee: ఉదయం లేవగానే కాఫీతో రోజు ఆరంభమవుతుంది.. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాక కాఫీ తాగాల్సిందే.. మనం ఎవరింటికైనా వెళ్తే కాఫీ.. ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ.. ఇలా మన జీవితంలో కాఫీ కలిసిపోయింది.. ఇందులో ఉండే కెఫిన్, యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ వలన కాఫీ హెల్దీ కూడా.. ప్రతి రోజు కాఫీ తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

*కాఫీ తాగడం వలన అలసట ఉండదు. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో ఉన్న కెఫిన్ రక్తంలోకి చేరి అక్కడి నుండి బ్రెయిన్ లోకి చేరుతుంది.
*కాఫీ తాగడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
* కాఫీలో ఉండే కెఫిన్ వల్ల గుండెపోటుకు దారితీసే హానికరమైన ఎంజైమ్లు దరిచేరనీయకుండా చూస్తుంది. అంతేకాకుండా ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
* రోజుకు 3 కప్పుల కాఫీ తాగే వారిలో ఉబ్బసం వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.
* కాఫీ డికాక్షన్ తాగడం వలన దగ్గు, జలుబు, అతినిద్ర వంటి లక్షణాల గురించి త్వరగా బయటపడవచ్చు.
* రోజూ కాఫీ తాగడం వలన రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
* కాఫీ తాగడం వల్ల టైపు-2 డయాబెటిస్ తగ్గుతుంది.
*రెండు, మూడు కప్పుల కాఫీ మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయ క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది.
*కాఫీ తాగడం ద్వారా మీ మానసిక పరిస్థితి కూడా మెరుగవుతుంది .