Computer: ప్రస్తుత కాలంలో చాలా మంది సొంతంగా వ్యాపారం పెట్టాలని భావిస్తున్నారు. అలాంటి వారి కోసమే పెట్టుబడి లేని ఒక బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. సాధారణంగా చాలామంది ఉద్యోగం ద్వారా కాకుండా సొంతంగా వ్యాపారం పెట్టి లక్షాధికారి కావాలని నేటి యువత భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయితే అనేకమంది వారిలో ఉన్న టాలెంట్ ను సద్వినియోగం చేసుకొని ధనవంతులు కాగలమని తెలియక.. ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ చిన్న బిజినెస్ ఐడియా తీసుకురావడం జరిగింది.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా , పాలిటిక్స్ పైన అవగాహన లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అందుకే ఈ అవగాహననే మీరు పెట్టుబడిగా మార్చుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. మీరే మరో 10 మందికి పని కల్పించే స్థాయికి కూడా చేరవచ్చు. ఇందుకోసం మీ దగ్గర కేవలం ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. సోషల్ మీడియా ఖాతాలను ఏర్పాటు చేసుకొని ప్రముఖ కంపెనీలను మీరు ప్రమోట్ చేయడమే.. సాధారణంగా ఎన్నో కంపెనీలు తమను తాము ప్రమోట్ చేసుకుంటూ లక్షల ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఆ ఖాతాలన్నీ వారి మీద కనిపిస్తూ ఉన్నా.. వాటిని మెయింటైన్ చేసేవారు వేరే ఉంటారు.
ఆయా నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా వేరే వేరే పేర్లతో కూడా ఖాతాలను కూడా తెరిచి తద్వారా వారికి తగినట్టు పబ్లిసిటీ లభించేలా.. వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లేలా చేసుకుంటారు. కాబట్టి వీటిపై మీకు అవగాహన ఉంటే సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా వ్యవహరించవచ్చు. దీనికి ఎక్కువగా శ్రమ ఉండదు.. కేవలం మీ ఇంట్లో ఉండే కంప్యూటర్ ముందు కూర్చుని వారు పంపించే ఫోటోలు, ఇతర కంటెంట్ ను ఆసక్తికరంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలు. ఇందులో మీరు పేరు తెచ్చుకుంటే ఒకే సారి అనేకమంది సోషల్ మీడియా ఖాతాలను మెయింటైన్ చేసే అవకాశం కూడా లభించే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఒక కంప్యూటర్ సహాయంతో లక్షలు సంపాదించవచ్చు.