NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: షాక్ః మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… మ‌న సంగ‌తి ఏందంటే…

Corona: క‌రోనా క‌ల‌క‌లం స‌ద్దుమ‌ణిగింద‌ని, ఒక‌వేళ‌ ఉంటే గింటే.. థ‌ర్డ్ వేవ్ రూపంలోనే స‌మ‌స్య‌లు అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్న స‌మ‌యంలో ఓ షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, ఆస్పత్రుల్లో సౌక‌ర్యాలు కల్పించాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ఆ రాష్ట్రాలకు లెటర్ రాశారు.

Read More: Corona: క‌రోనా క‌ల‌క‌లం… ఓ గుడ్ న్యూస్ ఇంకో బ్యాడ్ న్యూస్‌


ఆ రాష్ట్రాలు ఇవే…
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వీక్లీ పాజిటివిటీ ఎక్కువగా ఉన్న జిల్లాలను లెటర్ లో పేర్కొన్న కేంద్రం.. ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అరుణాచల్ ప్రదేశ్ లో వీక్లీ పాజిటివిటీ రేటు 16.2 శాతంగా ఉందని, నెల రోజుల్లోనే కేసుల సంఖ్య 12 శాతం పెరిగిందని రాజేశ్ భూషణ్ చెప్పారు. 9 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉందని పేర్కొన్నారు. అస్సాంలో 4 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, కొన్ని జిల్లాల్లో డెత్స్ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మణిపూర్ లోని రెండు జిల్లాల్లో కేసులు, మ‌ర‌ణాలు పెరిగాయన్నారు. కేరళలోని చాలా జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని, మేఘాలయలో 14.05 శాతానికి పెరిగిందని చెప్పారు. నాగాలాండ్, ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు.

Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

కొత్త కేసులు 43 వేలు.. డెత్స్ 930
దేశంలో కొత్తగా 43,733 కేసులు నమోదయ్యాయని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.06 కోట్లకు చేరిందని చెప్పింది. వైరస్​తో మరో 930 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 4.04 లక్షలకు చేరిందని వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4.59 లక్షలకు తగ్గిందని పేర్కొంది. రికవరీ రేటు 97.18 శాతానికి పెరగ్గా.. డైలీ పాజిటివిటీ రేటు 2.29 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39 శాతానికి తగ్గింది. డెత్ రేటు 1.32 శాతంగా నమోదైంది. కొత్త కేసుల కంటే రికవరీలు పెరిగాయని, ఇప్పటివరకు 2.97 కోట్ల మంది కోలుకున్నారని హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. ఇప్పటి వరకు 36.13 కోట్ల డోసుల టీకాలు వేశామని పేర్కొంది.

author avatar
sridhar

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju