‘కరోనా వైరస్’లో కొత్తకోణం.. తేల్చి చెప్పిన అమెరికా పరిశోధకులు!

కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకలు వ్యాక్సిన్ కోసం పోరాడుతున్న ఫలితం లేకుండా ఉంది. వచ్చిన ఒక్క రష్యా వ్యాక్సిన్ లో కూడా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్ అంటున్నారు పరిశోధకులు. ఇక మరో వైపు కరోనా వైరస్ నిధానంగా వ్యాపిస్తున్నప్పటికీ చుక్కలు చూపిస్తుంది.

 

అయితే అలాంటి వైరస్ గురించి ఇప్పుడు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అది ఏంటంటే.. అమెరికాలో కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోందని అందుకే వైరల్ లోడ్ కు మ్యుటేట్ లింక్ కనిపిస్తోందని అమెరికా పరిశోధకులు తెలిపారు.

నిన్న బుధవారం నాడు అమెరికా వైద్య పరిశోధకులు కొత్తగా చేసిన అధ్యయనం గురించి ప్రకటించారు. అందులో 5 వేలకుపైగా జెనెటిక్ సిఖ్వాన్స్ స్ ను స్టడీ చేశారు. ఇక అందులో కరోనా వైరస్ మ్యుటేట్ అవుతోందని ఒకటి కాకుండా ఎన్నో రకాలు కరోనా వైరస్ ఉందని, ఒకదానితో మరొకటి కలిసి కొత్త రకం కరోనా వైరస్ ను సృష్టిస్తుందని అందు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

ఇక దీని వల్లనే కరోనా వైరస్ కంట్రోల్ కావడం లేదని అమెరికా పరిశోధకులు తెలిపారు. అంతేకాదు కరోనా వైరస్ రోజు రోజుకు ప్రాణాంతకంగా మారిపోతుందని వారు తెలిపారు. కరోనా వైరస్ లో చిన్న చిన్న మార్పులే ఉన్నప్పటికి అది చాలా వరకు స్వరూపం మారిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం లక్షలమంది కరోనా వైరస్ రోగులు ఉన్నారంటే దానికి కారణంగా మూటెట్ అవ్వడమే అని పరిశోధకులు చెప్తున్నారు.