Costly Mango: ఒక్కో మామిడి పండు రూ. 1000.. దీని వెరైటీ తెలుసా..!?

Share

Costly Mango: వేసవి కాలం వచ్చింది అంటే నోరూరించే రకరకాల మామిడి పండ్లు మర్కెట్ లో దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా ఏపిలో బంగినపల్లి, తియ్య మామిడి, చిన్న రసం, కలెక్టర్, చెరకు రసం, పెద్దరసం, దసేరి, కేసరి, అల్పన్సా, పండూరి పండు, సువర్ణరేఖ, మల్లిక, నూజివీడు తియ్య మామిడి, జలం, నల్లరసం తదితర రకాలు లభ్యమవుతుంటాయి. అయితే ఓ మామిడి పండు ధర అక్షరాలా వెయ్యి రూపాయలకు విక్రయించేవి కూడా ఉన్నాయి.  అయితీ మన ప్రాంతానికి పరిచయం లేని ఆ మామిడి పండు పేరు నూర్జహాన్. మామిడి పండు ధర అంత ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా అది మాత్రం నిజం. మధ్యప్రదేశ్ లోని అలీరాజాపూర్ జిల్లాలో నూర్జహాన్ రకం మామిడి పండుకు మంచి గిరాకీ ఉంది. పూత దశలో ఉండగానే అనేక మంది వీటిని బుక్ చేసుకుంటారుట. దాన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది ఆ పండు అంటే ఎంత డిమాండ్ ఉందో.

Costly Mango nurjahan
Costly Mango nurjahan

అఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు అనుకుని ఉన్న ఆలీరాజ్ పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు. కాయ బరువు రెండున్నర నుండి మూడు కేజీల వరకూ ఉంటుంది. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా కాయ బరువు రెండున్నర కిలోలు మాత్రమే తూగిందని చెబుతున్నారు. 2019లో ఈ పండు ధర రూ.1200ల వరకూ పలికిందని సమాచారం.

Read More: Breaking: ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల దిగుబడి బాగానే వచ్చిందని నూర్జహాన్ రకం పండించే రైతులు పేర్కొంటున్నారు. కాయ బరువు కూడా మూడు కిలోల వరకూ ఉందని తెలిపారు. ప్రతి ఏడా జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు వస్తాయి. జూన్ ప్రారంభం నుండి పండ్లు చేతికి వస్తాయి. ఒక్కో పండు అడుగు మేర పొడవు ఉంటాయి.


Share

Related posts

Sreekaaram : శ్రీకారం సినిమా బ్లాక్ బస్టర్ .. ఈ పోటీ చూస్తుంటేనే అర్థమవుతోంది..!

GRK

దారుణం.. మినార్ బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్!

arun kanna

Panchayat Polls : ముగిసిన తొలివిడత పోలింగ్

somaraju sharma