CoviSelf Test: చైనాలోని ఊహాన్ లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. మొదటి వేవ్ అయిపోయింది అనుకునే లోపే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ విజృంభిస్తోంది.. అయితే కరోనా టెస్టులు చేయించుకోవాలంటే పెద్దపెద్ద క్యూ లైన్స్ లో నుంచోవాల్సి వస్తోంది.. అంతేకాకుండా క్యూ లైన్స్ లో ఎక్కువ సమయం నిల్చొడం వలన కూడా లేనివారికి కూడా వైరస్ సోకుతుందనే భయం కూడా ఉంది.. అయితే ఈ సమస్యకు కేంద్రం చెక్ పెట్టింది.. మై లాప్స్ వారు తయారుచేసిన కోవి సెల్ఫ్ కిట్టు ను ఐసీఎంఆర్ ఆమోదించింది.. దీంతో ఇంట్లోనే ఉండి కేవలం 15 నిమిషాల్లో రిజల్ట్ ను తెలుసుకోవచ్చు..!!

పూనే కు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన కొవి సెల్ఫ్ రాపిడ్ కిట్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ వినియోగించవచ్చని ధ్రువీకరించింది.. ఈ రాపిడ్ యాంటిజెన్ కిట్ ను కరోనా సోకిన వ్యక్తులని కలిసిన వారు, కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు ఈ టెస్ట్ వినియోగించి కేవలం పదిహేను నిమిషాల్లోనే రిజల్ట్ తెలుసుకోవచ్చు.. ఈ కొవి సెల్ఫ్ రాపిడ్ కిట్ ధర కేవలం రూ.250. ఒక వారం రోజుల్లో ఈ కిట్స్ అందరికీ అందుబాటులోకి రానున్నాయి.. ఈ కిట్ ను ఎలా ఉపయోగించాలో కూడా ఒక వీడియో రూపంగా తెలియజేశారు..
ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. బాలినేని మాటలు జగన్ మాటలుగానే భావిస్తున్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి