Curry Leaves Tea: ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ తాగితే బరువు తగ్గుతారట..!!

Share

Curry Leaves Tea: కరివేపాకు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. కూర ఏదైనా సరే కరివేపాకు కచ్చితంగా ఉండాల్సిందే.. కొంతమంది కూరలో కరివేపాకును తీసి పక్కనపెట్టి తింటూ ఉంటారు.. అయితే కరివేపాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా ఇప్పటి నుంచి అలా చేయరు..!! కరివేపాకు వంటలకు సువాసనలు మాత్రమే కాదు ఔషధగుణాలు కూడా కలిగి ఉంది.. దీనిని వంటలకు మాత్రమే కాదు టీల తయారీలో ఉపయోగిస్తున్నారు..!! కరివేపాకు టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు..!!

 

Curry Leaves Tea: helps on weight loss
Curry Leaves Tea: helps on weight loss

Curry Leaves Tea: కరివేపాకు టీని ఇలా తాగండి.. ఈ ప్రయోజనాలు పొందండి..!!

10 కరివేపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీరు పోయాలి. ఇందులో చిన్న ముక్క అల్లం వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత మరో పది నిమిషాల పాటు మూతపెట్టి అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ నీటిని వడపోసు కోవాలి. ఇందులో మీకు కావాలంటే తేనే, నిమ్మరసం కలుపుకోవచ్చు.. అంతే కరివేపాకు టీ తాగడానికి సిద్ధం.. కరివేపాకు ప్రతిరోజూ తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Curry Leaves Tea: helps on weight loss
Curry Leaves Tea: helps on weight loss

కరివేపాకు టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు కరివేపాకు అద్భుతంగా సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు ను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. కరివేపాకు టి శరీరానికి కావల్సిన న్యూట్రీయంట్స్ ను అందిస్తుంది. చలికాలంలో తాగితే శరీరాన్ని పచ్చగా ఉంచుతుంది.

Curry Leaves Tea: helps on weight loss
Curry Leaves Tea: helps on weight loss

కరివేపాకు లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరం లోకి హానికర క్రిములు ప్రవేశించకుండా చేస్తుంది. మన శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ టీ ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు తగ్గడానికి సహాయపడుతాయి. వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది. ఆకలి వేసేలా చేస్తుంది. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను ఉంచుతుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. రుతు క్రమం సమయంలో వచ్చే అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది.

Curry Leaves Tea: helps on weight loss
Curry Leaves Tea: helps on weight loss

ఇటీవల చేసిన పలు అధ్యయనాల ప్రకారం, కరివేపాకు టీ తాగడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ అదుపులో ఉంటాయని తేలింది. డయాబెటిస్ మేనేజ్ చేయడానికి కరివేపాకు అద్భుతంగా సహాయపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు కచ్చితంగా ప్రతిరోజు ఈ టీని తాగితే మెరుగైన ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇది జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాసు టీ తాగితే శరీరంలో మలినాలను తొలగించి శరీరం మెటబాలిజమ్ బూస్ట్ చేస్తుంది.


Share

Related posts

Kodali Nani: దేశంలో డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు.. కొడాలి నాని సీరియస్ కామెంట్స్..!!

sekhar

beauty: అందమైన చర్మం కోసం రకరకాల క్రీం లు వాడుతున్నారా?అయితే ఇది తెలుసుకోండి!!

siddhu

Anikha Surendran Adorable Photos

Gallery Desk