NewsOrbit
ట్రెండింగ్

Easy Money Crime: మనీ యాప్స్ తో మోసపోయిన 5లక్షల మంది..! కోట్లలో వసూళ్లు..!!

cyber crime by easy money apps

Easy Money Crime: ఈజీ మనీ నేరాలు Easy Money Crime మొన్నటికి మొన్న లోన్ యాప్స్ ఆర్ధికంగా ఎందరిని కుంగదీశాయో తెలిసిందే. వాళ్ల అరాచకాలకు ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ తరహా కాకపోయినా అటువంటి ఘోరమే మరొకటి జరిగింది. ఈజీ మనీ ఆశజూపి ప్రజలను బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. ఈ రెండు నేరాలు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ ద్వారానే జరిగాయి. ఈ నయా మోసంలో ఏకంగా 5లక్షల మందిని మోసం చేసి కోట్లలో మోసం చేసారు. ఈ మొత్తం ఏకంగా 150 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి గుట్టు రట్టు చేశారు. ఇదంతా కేవలం రెండు నెలల కాలంలోనే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

cyber crime by easy money apps
cyber crime by easy money apps

‘పవర్ బ్యాంక్’, ‘సన్ ఫ్యాక్టరీ’, ’ఈజడ్’ అనే యాప్స్ ద్వారా 11 మంది సభ్యుల ముఠా ఈ మోసాలకు పాల్పడింది. గుగుల్ ప్లేస్టోర్ లో ‘పవర్ బ్యాంక్’ అనే ఇన్వెస్ట్ మెంట్ యాప్ క్రియేట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తక్కువ కాలంలోనే ఇస్తామనడంతో బాధితులు ఆకర్షితులయ్యారు. పెట్టుబడులపై 5-10 శాతం ఇన్ స్టంట్ రిటర్న్స్ వస్తాయని.. ఇది ప్రారంభ ఆఫర్ అంటూ ప్రకటించడంతో ఈజీ మనీ కోసం లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా కోట్లలో వసూళ్లు చేశాక మోసం జరిగిందని తెలియడంతో బాధితులు ఢిల్లీ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసు సైబర్ స్పెషల్ అన్వేశ్ రాయ్ మాట్లాడుతూ..

Read More: Anandaiah Medicine: ఆనందయ్య మెడిసిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

‘ఈజీ మనీకి ఆశపడి బాధితులు లక్షల్లో నష్టపోయారు. పవర్ బ్యాంక్ యాప్ బెంగళూరులో ఏర్పాటైనట్టు కనిపిస్తోంది. కానీ.. సర్వర్ చైనాలో ఉంది. ప్రస్తుతం యూజర్ల ఖాతాలు బ్లాక్ చేశాం. యాప్ క్రియేటర్ షేక్ రూబిన్, మరో 9 మందిని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అరెస్టు చేశాం. మరో నిందితుడి కోసం గాలిస్తున్నాం. నిందితుల్లో ఇద్దరు అవిక్ కేడియా రొనాక్ బన్సాల్ చార్టర్డ్ అకౌంటెంట్లుగా ఈ ముఠాలో పని చేశారు. 110కి పైగా డొల్ల కంపెనీలు సృష్టించి ఒక్కో కంపెనీ నుంచి చైనీయులకు 2-3 లక్షలు చొప్పున బదిలీ చేశారు. రూబిన్ 29 బ్యాంకు ఖాతాలు తెరిచాడు’ అని తెలిపారు.

 

 

author avatar
Muraliak

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju