Daare Leda: నాచురల్ స్టార్ నాని కరోనా విపత్కర సమయంలో విశేష సేవలు అందించిన డాక్టర్స్ హెల్త్ వర్కర్స్ ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం “దారే లేదా” స్పెషల్ వీడియో సాంగ్ రూపొందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ పాటలో ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్, రూపా కోడువయూర్ నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రత్యేకమైన పాటను తెలుగు, తమిళ వెర్షన్ లో రిలీజ్ చేశారు..!!

Read More: Raja Raja Chora: ఆకట్టుకుంటున్న రాజ రాజ చోర టీజర్..!!
మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా.. మాతో కాదంటూ.. చూస్తూ ఉండాలా.. దారే లేదా..!! గాలి భయమైందా.!? శ్వాసే కరువైందా..!? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగానే పోనే పోదా.. అంటూ కేకే రాసిన పాట ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా చెప్పవచ్చు.. ఈ పాట చివరిలో బాధ్యత గల ఒక పౌరుడిగా నాని ఓ మెరుపులా మెరిశాడు.. విజయ్ బుల్గానిన్ కంపోజ్ తీసిన ఈ పాట మరో లెవెల్ కి తీసుకెళ్ళింది.. ఈ స్ఫూర్తిదాయకమైన పాటకు కేకే లిరిక్స్ అందించారు. నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై మ్యూజిక్ వీడియోను సమర్పించారు. అలాగే చాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను తీసుకుంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సంక్లిష్ట పరిస్థితులలో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్ లో పెట్టి కరోనా బాధితులకు విశేష సేవలు అందించి చాలా మంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ స్పెషల్ సాంగ్ అంకితం చేశారు..