Dear Megha: అదిత్ అరుణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ ఎంటర్ టైనర్ డియర్ మేఘా..!! విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇటివల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా డియర్ మేఘా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

హాయ్ నేను మేఘా స్వరూప్.. నాకు లవ్ లో పీహెచ్డీ ఉంది.. కాలేజ్ లో ఉన్నప్పుడు ఒకసారైనా నన్ను చూశావా.. నిన్ను చూసినన్ను సార్లు బుక్స్ చూసి ఉంటే క్లాస్ టాపర్ అయ్యేదాన్ని.. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం.. ఇక పర్మినెంట్ గా బై చెప్పే టైమ్ వచ్చింది. అతి ఎక్కువ సంతోషానికైనా.. అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది.. ఒక అమ్మాయి ప్రపంచంలోని మిగతా అమ్మాయిలందరిని మర్చిపోయేలా చేసింది.. లవ్ ఇజ్ అన్ కండిషనల్.. కథలకు అంతం ఉంటుంది కానీ.. ప్రేమ కథలకు కాదు.. అంటున్న డియర్ మేఘా.. టీజర్ తోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. టీజర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది.. ఆగస్ట్ డియర్ మేఘా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈలోపు ఈ టీజర్ చూసేయండి…