Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా ఉండాలని షో నిర్వాహకులు ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గత సీజన్ లో చాలా వరకు తెలియని ముఖాలు.. హౌస్ లోకి రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ నుండి.. చాలా నెగిటివిటీ రావటం జరిగింది. అంత మాత్రమే కాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతోపాటు హౌస్ లో… మసాలా కంటెంట్ కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో… ఈసారి సీజన్ సిక్స్ లో.. అందరికీ తెలిసిన వారిని.. ఎక్కువ వార్తల్లో నిలిచి కాంట్రవర్సీ మూట కట్టుకున్న.. వారిని హౌస్ లోకి పంపించాలని షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. దీంతో దీప్తి సునయన(Deepthi Sunaina)… శ్రీహాన్(Srihan) నీ .. సీజన్ సిక్స్ లోకి తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. సీజన్ ఫైవ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో.. వీకెండ్ లో.. వచ్చి స్టేజిపై అదరగొట్టాడు. సిరి కి సపోర్ట్ చేస్తూ.. హౌస్ లో జరిగే పరిస్థితులను అర్థం చేసుకోగలను.. అంటూ స్టేజిపై కామెడీ పండించడం మాత్రమేకాక తనలో ఉన్న సింగర్ టాలెంట్ బయటికి తీశాడు. ఆ వీకెండ్ ఫ్యామిలీ ఎపిసోడ్ మొత్తానికి శ్రీ హాన్ హైలెట్ గా నిలిచాడు. దీంతో అప్పట్లోనే మనోడు నెక్స్ట్ సీజన్ కి కన్ఫామ్ అని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే… సీజన్ సిక్స్ ఓటీటిలో కావటంతో.. షో నిర్వాహకులు శ్రీహాన్ నీ ఇటీవల సంప్రదించినట్లు అతను కూడా ఒకే అన్నట్లు లేటెస్ట్ టాక్.
ఇదే తరుణంలో మాజీ ఇంటి సభ్యులను కూడా ఈసారి ఓటిటి బిగ్ బాస్ లోకి.. తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ 2 లో ఆడిన షణ్ముక్(Shanmukh) మాజీ ప్రియురాలు దీప్తి సునయన… సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు లేటెస్ట్ టాక్. సిరి(Siri)- షణ్ముక్ గత సీజన్ లో బాగా నెగిటివిటీ బయట మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన.. శ్రీహాన్.. దీప్తి సునయన ఈసారి హౌస్ లోకి తీసుకు వస్తే.. తిరుగు ఉండదని షో నిర్వాహకులు ఈ ప్లాన్ వేసినట్లు.. వార్తలు వస్తున్నాయి.