ట్రెండింగ్ న్యూస్

Delhi High Court: సూపర్ కారణం – రూ. 50 నోటు వద్దని కోర్టులో పిటిషన్..!

Delhi High Court 50 Note Issue Petition in Court
Share

Delhi High Court: దేశంలో చలామణీలో ఉన్న నగదు నోట్లులో రూ. 50నోటు రద్దు చేయాలనీ, చలామణీ ఆపేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. తక్షణమే ఈ నోటుని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది రోహిత్ డాండ్రియాల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడా ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఇంతకు కారణం ఏమిటంటే… ఈ నోటును గుర్తించడంలో అంధులు ఇబ్బందులు పడుతున్నారని, రూ.100, రూ.500 నోట్ల అలాగే రూ.50 కూడా నోటు ఉన్న కారణంగా తాకినప్పుడు ఇబ్బందులు పడి, తడబడుతున్నట్టు తనకు చాలా మంది అంధులు చెప్పారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అంధులు వినియోగించేందుకు వీలుగా రూ.50 నాణేని విడుదల చేసేలా కేంద్రం, రిజర్వు బ్యాంకు సూచించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలా చేయటం వల్ల అందరితో పాటు అంధులు కూడా సమానమైన అవకాశాలు పొందటానికి, వ్యాపారం సులువుగా చేసుకునే వెసులు బాటు ఉంటుందని అన్నారు. ఈ పిటిషన్ 2022 ఫిబ్రవరి 25న విచారణకు రానుంది.

Delhi High Court: 50 Note Issue.. Petition in Court
Delhi High Court: 50 Note Issue.. Petition in Court

Share

Related posts

‘పోలవరం’లో గిన్నిస్ రేస్ మొదలు

somaraju sharma

ప్రభాస్ సినిమాకి సంతకం కూడా పెట్టిన దీపకా పదుకొణె ఆఖరి నిముషంలో షాకివ్వనుందా.. దీనికి కారణం రణ్ వీరేనా ..?

GRK

Road Accident: శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం..! నలుగురు మృతి..

Srinivas Manem