Dethadi Harika : దేత్తడి హారిక కు యూట్యూబ్ సోషల్ మీడియా లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది.. ఆ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది.. టాలెంట్ మీ సొంతమైతే ప్రపంచం నీ వెంటే ఉంటుందని నిరూపించేలా బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త చేతుల మీదగా TSTDC బ్రాండ్ అంబాసిడర్ గా నియామక పత్రాన్ని అందుకుంది దేత్తడి హారిక..
On the occasion of #InternationalWomensDay celebrated women's day in @tstdcofficial office. @KTRTRS garu from today every monday Tourism staff will be wearing Handloom clothes. In support to Handloom weavers of Telangana State. #HandloomMonday @TelanganaCMO @tstdcofficial pic.twitter.com/CKyvZLkvTh
— Uppala Srinivas Gupta TRS (@USrinivasGupta) March 8, 2021
ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను కూడా షేర్ చేశారు. విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు హారిక కు కంగ్రాట్స్ చెబుతున్నారు.. ఈ విషయంపై స్పందించిన హారిక.. ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభమైందని, ఎప్పటికైనా హీరోయిన్ గా సినిమాలు చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా తన మనసు లో మాట బయట పెట్టింది హారిక. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యమున్న సినిమా లో హీరోయిన్ గా నటించాలని ఉందని ఆమె తెలిపింది.
https://twitter.com/harika_alekhya/status/1368823560433627140?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368823560433627140%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftv%2Fbigg-boss-telugu%2Fdethadi-harika-appointed-as-telangana-tourism-brand-ambassador%2Farticleshow%2F81406172.cms