Sudigalli Sudheer Dhanraj: తెలుగు బుల్లితెర పై సామాన్య కమెడియన్ గా జబర్దస్త్ షో లో.. ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించడం తెలిసిందే. మనోడు కామెడీకి చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వారి వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్.. ఇండస్ట్రీలో తక్కువ కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా అవకాశాలు అందుకుంటూ.. ఇప్పుడు హీరోగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో సుడిగాలి సుదీర్ గురించి ధనా ధన్ ధన్ రాజ్ ఇటీవల వైరల్ కామెంట్లు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒక ప్రైవేటు ఇంటర్వ్యూలో ధన్ రాజ్.. సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుధీర్ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. షూటింగ్ అయితే చాలు సుడిగాలి సుదీర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎందు కంటే ఎక్కువగా తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తాడు. చిన్న వయసునుండే కుటుంబ ఫారాలను మోసిన సుధీర్.. ఎన్నో కష్టాలను అనుభవించారు. ఈ క్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుధీర్ నీ.. జబర్దస్త్ కార్యక్రమంలో తన టీమ్ లో తీసుకున్నట్లు ధనరాజ్ గుర్తు చేశారు. అంచెలంచెలుగా ఎదిగిన సుధీర్ కెరియర్ పరంగా ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినగాని ప్రారంభంలో ఉన్న గౌరవ మర్యాదలు తోనే.. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అని ధనరాజ్ వెల్లడించారు.
ఇక స్టేజిపై స్కిట్ లో సుధీర్ చాలా మంది అమ్మాయిలను ఏడిపిస్తూ.. సరదాగా చేస్తూ ఉంటాడు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి సుధీర్ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్. అసలు పార్టీలకు వాడు రాత్రి 9 అయితే ఫోన్ కూడా పని చేయదు. ఫోన్ మొత్తం స్విచాఫ్ చేసి.. ఇంటికే పరిమితం అవుతారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా టెలివిజన్ రంగంలో స్కిట్ విషయాల్లో.. తోటివారితో పంచ్ డైలాగులు వేయించుకుంటాడు. అతని కున్న క్రేజ్ బట్టి అంత అవసరం.. లేదని నా అభిప్రాయం అంటూ ధనరాజ్.. సుధీర్ పై తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ వైరల్ కామెంట్లు చేశారు.