Diabetes: ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. మనదేశంలో షుగర్ వలన బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఏడు మంది షుగర్ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు.. షుగర్ వ్యాధిని ముందే గుర్తిస్తే అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. డయాబెటిస్ వచ్చేముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని గుర్తిస్తే సమస్యకు త్వరగా చెక్ పెట్టవచ్చు.. డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Diabetes: డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు..!!
డయాబెటిస్ అనేది క్రానిక్ కండిషన్. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. పాంక్రియాస్ ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం, తక్కువగా ఉండడం, దేహం ఇన్సులిన్ ను సరిగ్గా తీసుకోలేక పోవడం వలన మధుమేహం సమస్య వస్తుంది.
డయాబెటిస్ వచ్చే ముందు లక్షణాలు గమనిస్తే ముందుగానే అప్రమత్తం అవ్వచ్చు. ముందే కనిపించే లక్షణాలను ఫ్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు.. ఈ స్టేజ్ లో కొంతమందికి జుట్టు రాలడం మొదలవుతుంది. మరి కొంతమందికి రోజంతా అలసటగా ఉండటం, ఏ పని చేయకపోయినా కూడా నీరసం అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి కొందరిలో చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. కొంతమంది లో వీటికి తోడు తలనొప్పి, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు పట్టడం కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహానికి సంకేతాలు చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైన చెప్పుకొన్న ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను కలవడం ఉత్తమం. లేకపోతే సమస్య మరింత తీవ్రంగా మారి అనేక సమస్యలు తలెత్తుతాయి.

డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తున్న వారు త్వరగా డాక్టర్ను సంప్రదించడం మంచిది. పరీక్ష చేయించుకుంటే నిర్ధారణ వస్తుంది. డయాబెటిస్ వచ్చే సూచనలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పే కచ్చితంగా మీ డైట్ ను మార్చుకోవాలి. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలోనే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి అనడం అలవాటు చేసుకోవాలి. కనీసం రోజుకు ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. తెల్ల బియ్యాన్ని కాకుండా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం మీ డైట్ లో నిదానంగా భాగం చేసుకోండి. కనీసం వారానికి ఒకసారైనా వీటిని తినండి. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకోండి. ఇప్పటినుంచే చిరుతిళ్లు తినకుండా ఉండండి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ప్రైస్ తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. అలాగే పచ్చళ్లను కూడా ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు, తీపి ని కలిగి ఉన్న పండ్లను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి తప్ప మిగతా ఏ దుంపలను మీ డైట్ లో తీసుకోవద్దు.. వీటిని ప్రయత్నిస్తూనే రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం మంచిది.