18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

District Gravity- The Adventure Park Review: హైదరాబాద్‌లో అడ్వెంచర్ పార్క్, డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్ ఏంటి? ఒకరోజు ఫామిలీ ఔటింగ్‌కి ఎంత ఖర్చు అవుతుంది? ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

District Gravity The Adventure Park Review
Share

District Gravity- The Adventure Park Review: హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ లో ఉన్న డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ చాలా పాపులర్ అయ్యింది. దీనికి వెళ్లాలనుకునే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. వాటిలో ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏంటి? ఒకరోజు ఫామిలీ ఔటింగ్‌కి ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాలు తెలుసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందామా..

Multi Activity Tower at District Gravity The Adventure Park in Hyderabad
Multi Activity Tower at District Gravity The Adventure Park in Hyderabad

డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: జిప్‌లైన్

District Gravity- The Adventure Park Review: డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: జిప్‌లైన్
District Gravity- The Adventure Park Review: డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: జిప్‌లైన్

ఈ పార్క్‌లో బ్యూటిఫుల్ నేచర్ సీన్స్ ఎంజాయ్ చేస్తూ 500 మీటర్ల దూరం వరకు 60 అడుగుల ఎత్తులో జిప్‌లైన్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు. పెద్దవారు దీనికి రూ.750తో పాటు జీఎస్టీ చెల్లించుకోవలసి ఉంటుంది.

డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: రోప్ కోర్స్

District Gravity- The Adventure Park Review: డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: రోప్ కోర్స్
District Gravity- The Adventure Park Review: డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: రోప్ కోర్స్

50 అడుగుల ఎత్తులో పిల్లల నుంచి పెద్దల వరకు రోప్ కోర్స్‌లో పాటిస్పేట్ చేయవచ్చు. 3 లెవెల్స్‌ ఏరియల్ డిఫికల్టీతో రోప్ కోర్స్ యాక్టివిటీని ఎంజాయ్ చేయవచ్చు. చిన్నపిల్లలకు రూ.300, ఆపై వయసు గల వారికి ఎక్కువ మనీ నిర్ణయించారు. జీఎస్టీ స్పెషల్‌గా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: చికేన్ సర్క్యూట్

District Gravity- The Adventure Park Review, డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: చికేన్ సర్క్యూట్
District Gravity- The Adventure Park Review, డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: చికేన్ సర్క్యూట్

మోటార్‌స్పోర్ట్స్ లవర్స్ కోసం ఇక్కడ చికేన్ సర్క్యూట్ యాక్టివిటీ కూడా అందుబాటులో ఉంచారు. 1.2కిమీ కార్టింగ్ ట్రాక్ పై మీరు 7 లాప్స్ వరకు కార్ట్స్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళవచ్చు. వాహనాన్ని బట్టి ఒక్కొక్కరికి ధర అనేది రూ.375 నుంచి రూ.900 వరకు ఉంటుంది.

డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: పూల్ ప్యారడైజ్‌

డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: పూల్ ప్యారడైజ్‌
డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న యాక్టివిటీస్: పూల్ ప్యారడైజ్‌

పూల్ ప్యారడైజ్‌కి ఎంట్రీ తీసుకోవాలంటే ముందుగా రెండు ప్యాకేజీల గురించి తెలుసుకోవాలి. ఔటింగ్ ప్యాకేజీలో ఉదయం 10:00 నుంచి సాయంత్రం 06:00 వరకు ఎంజాయ్ చేయవచ్చు. దీనికి 599 ప్లస్ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో రెయిన్ డ్యాన్స్‌తో డీజే, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, సాండ్ వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్ వంటి అవుట్‌డోర్ గేమ్‌లకు యాక్సెస్.. క్యారమ్, లూడో, స్నేక్ అండ్ లాడర్, చదరంగం, యారోస్‌ వంటి ఇండోర్ గేమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఇంకో ప్యాకేజీలో నియమించబడిన రెస్టారెంట్‌లో బఫెట్ లంచ్, స్నాక్స్ తో హై టీ పొందవచ్చు.
Movie Releases This Week in Theaters and OTT: మూవీ లవర్స్ కోసం.. ఈవారం ధియేటర్స్ లో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే.!!

ఇంకా ఇక్కడ మల్టీ యాక్టివిటీ టవర్, ఫన్ గోల్ఫ్‌, టార్జాన్ ట్రాక్స్, హ్యూమన్ స్లింగ్ షాట్‌ (రూ.400+జీఎస్టీ/పర్సన్), జెయింట్ స్వింగ్ (రూ.400+జీఎస్టీ/పర్సన్), పెయింట్ బాల్, మెల్ట్ డౌన్, బంగీ రన్, ఆర్చరీ, మడ్‌ రన్, యూరో బంగీ, బాస్కెట్బాల్ ఫుట్బాల్ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక్కో పర్సన్ కి వీటి ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వీకెండ్ టైమ్‌లో ఔట్‌ల్యాండర్, కమాండర్, డేర్‌డెవిల్ వంటి ప్యాకేజెస్ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేయవచ్చు.

ఫ్యామిలీ ప్యాకేజ్

District Gravity- The Adventure Park Review: Family Weekend Getaway Package Cost at District Gravity in Hyderabad
District Gravity- The Adventure Park Review: Family Weekend Getaway Package Cost at District Gravity in Hyderabad

ఒక కుటుంబం మొత్తం ఈ పార్క్‌లో ఎంజాయ్ చేసేందుకు ఒక ప్యాకేజీ కొనుగోలు చేయవచ్చు. ఫ్యామిలీగా వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసుకునేందుకు +91 9000 047 646 / +91 6302 752 228 ఫోన్ నంబర్స్‌కు కాల్ చేయవచ్చు.

District Gravity The Adventure Park Review
District Gravity The Adventure Park Review

మొత్తం మీద చెప్పోచ్చేదేంటంటే.. ఖాళీ టైమ్‌ దొరికితే ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేయవచ్చు. ధరలు కూడా మరీ ఎక్కువగా లేవు కాబట్టి సినిమాలకు బదులు ఇటువైపు ఓసారి చూడొచ్చు.

Weekend: వీకెండ్ కి ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడికి వెళ్ళండి !!


Share

Related posts

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షోలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేసిన సిరి..!!

sekhar

Rajamouli – Prashanth neel: ప్రశాంత్ నీల్ రాజమౌళితో ఎలా సమానం అవుతాడు..?

GRK

సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ వ్యవహారంలో సరి కొత్త ట్విస్ట్ !

Yandamuri