NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

సబ్జా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

సబ్జా గింజలు. భారతదేశ ఆయుర్వేద చికిత్సలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది,సబ్జా అనే పేరు హిందీ భాష నుంచి వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా సబ్జా గింజలను బేసిల్ సీడ్స్ గానే ప్రసిద్ధి చెందాయి. సబ్జా సీడ్ లేదా బేసిల్ సీడ్ యొక్క శాస్త్రీయ నామం “ఓసిమం బేసిలికం” భూమి మీద అనేక రకాల బేసిల్ ఉన్నాయి. బేసిల్ రకాలు ఆకులు ఆకారం మరియు రంగు ద్వారా నిర్ణయించబడతాయి.వీటి గింజలు చిన్నవిగా ఉన్నా మన ఆరోగ్యం కాపాడే విషయంలో ఎంతో ఉపయోగపడతాయి

సబ్జా గింజలలో చాలా ముఖ్యమైన పోషక విలువలు నిండి ఉన్నాయి . వీటిని వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత ను తగ్గించే శీతల పానీయాలలో ఎక్కువగా తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి వడదెబ్బ నుంచి కొంత వరకు రక్షిస్తాయి. మన శరీరానికి చలువ చేయడమే కాదు ఎంతో మెరుగైన ఆరోగ్యం కోసం వీరిని ఉపయోగించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అధికబరువు ,శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సబ్జా గింజలు వాడకం చక్కటి పరిష్కారం మార్గం

ప్రస్తుత ఆధునిక కాలంలో ఊబకాయం ,అధిక బరువు ప్రధాన సమస్య ఈ సమస్యతో బాధపడేవారికి సబ్జా గింజలు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయి. మూడు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిమిషాల పాటు గ్లాసుడు మంచినీళ్లు నానబెడితే తే వాటి పరిమాణం కంటే 30 రెట్లు అధికమవుతుంది .ఆహారం తీసుకునే ముందు సబ్జా గింజలు పానీయాన్ని సేవిస్తే కడుపు నిండిన భావన కలుగుతుంది తద్వారా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు ,ఇలా ఆరోగ్యకరమైన మార్గంలో బరువును తగ్గించుకోవచ్చు. ఇది డైటింగ్ చేసే వారికి కూడా చాలా ఉపయోగకరం

ఈ రోజుల్లో ఇంకో ప్రధానమైన సమస్య మధుమేహం.ఈ సమస్యకు కూడా సబ్జా గింజలు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతాయి ,రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసు పచ్చి పాలలో వేసుకొని ప్రతి ప్రతి రోజు తీసుకోవడం వలన డయాబెటిస్ కొంతవరకు తగ్గుతుంది.

సబ్జా గింజలను ప్రతి రోజు తీసుకోవడం వలన మన శరీరంలో యాంటీ ఫంగల్ ,యాంటీ వైరల్, యాంటీబయటిక్ మంచి లక్షణాలు అభివృద్ధి చెంది మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీపవర్ అభివృద్ధి చెందుతుంది తద్వారా ప్రమాదకరమైన అలర్జీల, నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

సబ్జా గింజల లో విటమిన్ K, ఐరన్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండటం వలన జుట్టు రాలే సమస్య కూడా నయమవుతుంది. తరుచూ డిప్రెషన్ కు లోన్ అవుతుంటే సబ్జా గింజలు తీసుకోవడం వలన మన శరీరంలో ద్రవాలు సమతుల్యం ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారు.

నోటి పూత, పళ్ల నుంచి రక్తం కారడం, చెడు శ్వాస వంటి లక్షణాలు ఉంటే సబ్జా గింజలు తీసుకోవడం ఉత్తమం ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వలన మన పళ్ళను రక్షించడానికి ఉపయోగపడతాయి

ఇలా సబ్జా గింజలు మన నిత్య ఆహారంలో భాగం అవడంవల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వవచ్చు .

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju