మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఏదైనా శుభకార్యానికి వెళ్లినప్పుడు అక్కడ మనకు పెరుగులో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలను, పేసి పెరుగు పచ్చడిగా వడ్డిస్తుంటారు. అయితే పూర్వకాలంలో ఇదేవిధంగా మన పెద్దవారు ప్రతిరోజు పెరుగన్నంలోకి పచ్చి ఉల్లిపాయను తినేవారు. ఈ అలవాటు ఇప్పటికీ చాలామందికి ఉంది. అయితే ఈ విధంగా మజ్జిగన్నంలోకి ఉల్లిపాయను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఉల్లిపాయ యాంటి మైక్రోబియల్, యాంటీసెప్టిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇన్ని పోషక విలువలతో కూడి ఉన్న ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలలో పటుత్వం ఉంటుంది. ఉల్లిపాయలో ఉన్న క్యాల్షియం ఎముకల పటుత్వానికి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు రాత్రి పెరుగన్నంతో పాటు పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ లో పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అదేవిధంగా మన శరీరంలో క్యాన్సర్ కారక కణాలను నిరోధించడానికి ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచి అనేక గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉల్లిపాయ విముక్తి కలిగిస్తుంది.

ఎంతోమంది దంతాల సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ప్రతి రోజు మజ్జిగ అన్నంలో ఉల్లిపాయను తినడం ద్వారా దంతాల నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వయసు పైబడిన యవ్వనంగా కనిపించాలనుకునేవారు ప్రతిరోజు మజ్జిగ అన్నంలో ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా చర్మంపై ముడతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు. ఈ విధంగా ఉల్లిపాయను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.