ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో ఏది మంచి…. ఏది చెడు అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. సోషల్ మీడియా వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ అదే రేంజ్ లో నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణ ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు ఎంతవరకు హ్యాక్ కి గురి అవుతున్నాయో తెలియదు కానీ సెలబ్రిటీల అకౌంట్లు మాత్రం తరచూ హ్యాకింగ్ కు గురవుతుంటాయి.
తాజాగా కార్తీక దీపం నిరుపం భార్య సోషల్ మీడియా అకౌంట్ కూడా హ్యాక్ అయిందట. నిరూపం అంటే మీకు ఎవరా అని అనిపించవచ్చు. డాక్టర్ బాబు, కార్తీక్ అనే పేరు చెపితే మాత్రం గుర్తుపడతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్, డాక్టర్ బాబు పాత్రలలో అతని టనకు ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో నిరుపమ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది.
ఇక అతని భార్య మంజుల కూడా సీరియల్ నటియే. మంజుల పరిటాల కు సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవలే మంజుల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. మామూలుగా మంజులకు అందులో 50 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ కావడంతో వెంటనే ఏదైనా సమస్యలు వస్తాయని నిరుపం అందరినీ హెచ్చరించాడు. పాత అకౌంట్ హ్యాక్ అయింది… దయచేసి కొత్త అకౌంట్ ఫాలో అవ్వండి మళ్ళీ మీ ప్రేమను కురిపించండి అని అభిమానులను కోరాడు. దీంతో అందరూ మంజుల కొత్త అకౌంట్ ను ఫాలో అయి నిరుపమ్ పై తనకున్న ప్రేమను నిరూపించుకున్నాడు.