ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వయసు తారతమ్యం లేకుండా జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఈ విధంగా జుట్టు తెల్లబడటానికి మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఒక భాగమే అని చెప్పవచ్చు. అయితే తెల్లగా అయిన జుట్టును నలుపుగా మారాలని ప్రతి ఒక్కరూ మార్కెట్లో దొరికే వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన హెయిర్ డై లను వాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా హెయిర్ డై వాడటం వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కొన్ని చిట్కాలను పాటించడంవల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా జుట్టు రంగు మారడానికి గల కారణం జుట్టు కుదుళ్లలో ఉన్న మెలనోసైట్స్ వల్ల జుట్టు రంగు మారుతుంది. మన శరీరంలో ఉండే మెలనిన్ స్థాయినిబట్టి మన జుట్టు రంగులో ఉంటుందని చెప్పవచ్చు. అయితే మెలనిన్ స్థాయి తగ్గినప్పుడు జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఈ విధంగా మెలనిన్ తగ్గడానికి మన శరీరంలో పోషకాలు లోపం కూడా ఒక కారణం కావచ్చు. అందుకోసమే మన శరీరానికి తగినన్ని విటమిన్లు, ఐరన్, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
చిన్న వయసులోనే జుట్టు సమస్యలతో బాధపడేవారు కరివేపాకు, మందారం, గోరింటాకు బాగా రుబ్బి ఆ మిశ్రమాన్ని తలలో కుదుళ్లకు అంటుకునే విధంగా పెట్టాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం ద్వారా క్రమంగా జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. అంతేకాకుండా పొన్నగంటి ఆకు, గుంటగరగరాకు, కరివేపాకు ఈ మూడింటినీ రుబ్బి తలకు రాసుకున్న మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొబ్బరి నూనెను చిన్న మంటపై వేడి చేసుకొని అందులో కరివేపాకు వేసి ఆ నూనెను తలకు రాసుకోవడం వల్ల క్రమంగా తెల్లజుట్టు నల్లబడుతుంది. ఈ విధమైన చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా తెల్లబడిన జుట్టు సైతం నల్ల బడుతుందని చెప్పవచ్చు.