ఇలా చేస్తే మ‌ధుమేహాన్ని త్వ‌ర‌గా త‌గ్గించొచ్చు!

డ‌యాబెటిస్.. మూడు ప‌దుల వ‌యస్సు రాక‌ముందే చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న రోగం. మిగ‌తా దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలోనే మ‌ధుమేహ రోగుల సంఖ్య ఎక్కువ‌ని మీకు తెలుసా? చిన్న వ‌య‌స్సు వారు సైతం మంచి ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయ‌మం చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న‌ టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ఈజీగా ప‌డిపోతున్నారు. ఈ మ‌ధుమేహ రోగులు ప్ర‌తిరోజూ మందుల‌ను వాడ‌టంతో పాటూ మంచి ఆహార అల‌వాట్ల‌ను అల‌వ‌రుచుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే సుల‌భంగా షుగ‌ర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇలా చేయ‌క‌పోతే షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గి మూర్చపోయే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. అందుకే షుగర్ తో బాధ పడేవాళ్లు షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండే విధంగా ప‌లు జాగ్రత్తలు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచాన్ని ఎంతో కాలంగా వణికిస్తున్న ఈ మ‌ధుమేహం రోగం చిన్న దెబ్బ తగిలినా చర్మం తట్టుకోలేని స్థితికి తీసుకుపోతుంది. అయితే కొందరిలో ఇది వంశపారంపర్యంగా వ‌స్తుంది.

ఈ రోగులు సాల్మన్, హెర్రింగ్, ఆంకోవిస్ లాంటి కొవ్వు కలిగిన చేపలను ఎక్కువగా తినాలి.అలాగే కేలరీలు తక్కువగా ఉండే ఆకు కూరలు తీసుకోవాలి. ఇలా చేస్తే.. షుగర్ లెవెల్స్ ను తగ్గించొచ్చు. అలాగే దాల్చిన చెక్క రక్తంలోని షుగర్ లెవెల్స్ ను త‌గ్గించ‌డానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు మధుమేహం వల్ల ప్రభావితమయ్యే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెరుగు కూడా షుగ‌ర్ లెవెల్స్ ను త‌గ్గిస్తుంది. తక్కువమొత్తంలో పిండి పదార్థాలను తీసుకోవాలి. అలా చేస్తే.. షుగ‌ర్ అదుపులో ఉంటుంది.