Plants: చాలామంది ఇంటి అందం కోసం, ఆహ్లాదం కోసం చుట్టూ చెట్లు మొక్కలు పెంచడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఈ కల్చర్ గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా పెరిగిపోయింది. కొంచెం స్థలం ఉంటే చాలు అందులో మొక్కల కుండీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సొంత ఇల్లు అయితే కట్టుకునేటప్పుడు మొక్కల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను ఇంట్లో నాటినట్లయితే అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి పొరపాటున కూడా ఇప్పుడు చెప్పబోయే మొక్కలు మీ ఇంటి ఆవరణలోకి కూడా తీసుకురాకూడదట. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రేగి చెట్టు:
ముళ్ళు కలిగిన రేగు చెట్టును ఎప్పుడు ఇంటి ఆవరణలో కానీ.. ఇంటి తోటలో కానీ నాటకూడదు. ఇది అశుభకరమైనది. ముఖ్యంగా మీ ఆర్థిక సంక్షోభాన్ని మరింత అతలాకుతలం చేస్తుంది.
రావి చెట్టు:
ఆక్సిజన్ యొక్క ఉత్తమ వనరు.. కానీ ఇంటి ఆవరణలో ఈ చెట్టు నాటితే మాత్రం వినాశనానికి సంకేతం. ఒకవేళ ఇప్పటికే మీ ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉన్నట్లయితే చుట్టూ గోడ కట్టి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తే దరిద్రం పోతుంది.
మర్రిచెట్టు:
మర్రిచెట్టు ఊడలు కిందికి దిగే కొద్దీ మన సంసారం కూడా పాతాళానికి తొక్కి వేయబడుతుందట. కాబట్టి ఇంటి ఆవరణలో మర్రిచెట్టు నాటకూడదు.
ఖర్జూర చెట్టు:
ఖర్జూర చెట్టును కూడా ఎప్పుడు ఇంటి ఆవరణలో నాటకూడదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని పెంచుతుంది.
జాక్ ఫ్రూట్ చెట్టు:
దీనిని కూడా మీ ఇంటి ప్రాంగణంలో నాటకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది.