Dry Grapes: ఎండు ద్రాక్ష తో చర్మాన్ని మెరిపించచ్చు..!!

Share

Dry Grapes: ఎండు ద్రాక్ష తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పటివరకు ద్రాక్ష తో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ని ఉపయోగించి ఉంటారు.. ఇప్పుడు ఎండు ద్రాక్ష తో ఫేస్ ప్యాక్, టోనర్, జెల్ తయారు చేసుకోవాలో..!? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Dry Grapes: Face Pack Tonner And Jel Preparation
Dry Grapes: Face Pack Tonner And Jel Preparation

ఫేస్ ప్యాక్ కోసం ముందుగా 4 స్పూన్స్ ఎండు ద్రాక్షను తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఎండుద్రాక్షలను పక్కకు తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో అర స్పూన్ తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఎండు ద్రాక్ష ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలు, ముఖంపై సన్నని గీతలను తొలగిస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ముందుగా రాత్రంతా ఎండు ద్రాక్షలు నానబెట్టిన నీటిని పారబోయకుండా 2 స్పూన్స్ నిమ్మరసం కలిపి ఒక స్ప్రే బాటిల్ పోసుకుని ఫేస్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.

Dry Grapes: Face Pack Tonner And Jel Preparation
Dry Grapes: Face Pack Tonner And Jel Preparation

 

ఎండు ద్రాక్ష జెల్ తయారు చేసుకోవడానికి ముందుగా రాత్రంతా ఒక ఆరు స్పూన్లు ఎండు ద్రాక్షను నానబెట్టుకోవాలి. రాత్రి నాన పెట్టుకున్న ఎండుద్రాక్ష లో ఒక స్పూన్ అలోవెరా జెల్ ఒకటి విటమిన్- ఈ క్యాప్సిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే జెల్ రెడీ. ఈ జెల్ ప్రతిరోజు రాసుకుంటే అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.


Share

Related posts

సుశాంత్ సింగ్ కేసు : అడ్డంగా ఇరుక్కుపోయిన ప్రభాస్ హీరోయిన్ .. ఆఖరి నిమిషం లో టాప్ సీక్రెట్ !! 

sekhar

NTR: ఎన్టీఆర్ లో ఆ టాలెంట్ చూసి కేజీఎఫ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కి కమిట్ అయ్యారట..??

sekhar

వెహికల్స్ ను ట్రాక్ చేయడానికి కొత్త యాప్ ని యూజ్ చేస్తున్న పోలీసులు

Siva Prasad