మన శరీరంలో అతి సున్నితమైన భాగం చెవులు. అందువలన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా ప్రతి ఒక్కరి చెవిలో గుమిలి ఏర్పడుతుంది. ఇది చెవిలో ఉండే నరాలకు రక్షణ ఇస్తుంది.ఇన్ఫక్షన్ రాకుండా కాపాడుతుంది.గుమిలి లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చెవిని శుభ్రం చేస్తాయి. సాధారణంగా చెవిలో పేరుకుపోయిన గుమిలి శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్ ఉపయోగిస్తాము.
అయితే ఈ విధానం చెవులకు హానీ కలిగిస్తుందని,చాలామందికి తెలియదు. చెవిలో గుమిలి శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్ ఉపయోగించడం వల్ల వాటికి ఉన్నా కాటన్ చెవికి అంటుకుంటుంది. దానివలన కాలక్రమేణా వినికిడి లోపం కలిగె ప్రమాదం ఉంది.
కాబట్టి కాటన్ బడ్స్ ఉపయోగించడానికి బదులుగా, కొన్ని సహజమైన చిట్కాలను ఉపయోగించి, చెవులను శుభ్రంగా ఉంచుకోవచ్చు. చెవిలోని వ్యర్ధాలను తొలగించడానికి ,వెల్లుల్లి నూనె ఒక మంచి ఔషధం. చెవిలో నుండి వచ్చే దుర్వాసనను నివారిస్తుంది.
కాబట్టి కాటన్ బడ్స్ ఉపయోగించడానికి బదులుగా, కొన్ని సహజమైన చిట్కాలను ఉపయోగించి, చెవులను శుభ్రంగా ఉంచుకోవచ్చు. చెవిలోని వ్యర్ధాలను తొలగించడానికి ,వెల్లుల్లి నూనె ఒక మంచి ఔషధం. చెవిలో నుండి వచ్చే దుర్వాసనను నివారిస్తుంది.
కొంత కొబ్బరి నూనెను తీసుకొని నాలుగు పొట్టు తియ్యని వెల్లులి రెబ్బలు వేసి పది నిమిషాలు నూనెను కాయాలి. ఇలా కాచి చల్లార పెట్టిన నూనెను చెవ్వులలో చుక్కలు చుక్కలు గా వేయండి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.ఇదేవిధంగా చెవ్వులను శుభ్రం చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.
2 స్పూన్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని, 2 స్పూన్స్ నీరు కలపండి. ఈ ద్రవాన్నిచెవ్వుల మీదనుండి వదిలి రెండు నిమిషాలకు శుభ్రం చేసుకోవాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఆమ్లత్వంచెవ్వులలో ని వ్యర్ధాలు పోగొట్టడానికి ఉపయోగపడుతుంది .