World Population : 8 బిలియన్లు చేరుకున్న ప్రపంచ జనాభా. నవంబర్ 15, 2022 ను ప్రపంచ జనాభా అక్షరాల 8,000,000,000 చేరుకున్న రోజుగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి. ఈ మైలురాయి చేరుకున్న మానవాళి ప్రయాణం లో ఎగుడు దిగుడులు ఎన్నో … న్యూస్ ఆర్బిట్ నుండి ప్రత్యేక కథనం
మాల్తుసియన్ సిద్ధాంతం గురించి వినే ఉంటారు, థామస్ రాబర్ట్ మాల్థస్ బ్రిటన్ కి చెందిన ఆర్థికవేత్త. ఇతను ప్రపంచ జనాభా పెరుగుదల ఇంకా వనరుల సంక్షోభం గురించి చెప్పినదే మాల్తుసియన్ సిద్ధాంతం.
ప్రపంచ జనాభా గురించి మాల్తుసియన్ సిద్ధాంతం ఏమంటుంది?
మాల్తుసియన్ సిద్ధాంతం ప్రకారం, కరువులు, యుద్ధం లేదా వ్యాధులు జనాభాను తగ్గించే వరకు మానవ జనాభా ఆహార సరఫరా కంటే వేగంగా పెరుగుతుంది. ప్రపంచ జనాభా 8 బిలియన్లు చురుక్కున ఈ రోజు మాల్తుసియన్ సిద్ధాంతం గుత్తుచేసుకోవడం చాలా అవసరం.

మొదటి 1 బిలియన్ జనాభా మైలురాయి
ఆధునిక మానవుడు అడవులు ధాటి నాగరికత దారి పట్టి మొదటి 1 బిలియన్ జనాభాకు చేరుకోవడానికి సుమారు 300 వేల సంవత్సరాలు పట్టింది. అనేకానేక రోగాలు, ప్రకృతి బీభత్సాలు, అంతర్గత కలహాలు, ఇలాంటివి ఎన్నో ధాటి ఈ మొదటి మైలురాయి మనం 1804 లో చేరుకున్నాం
అయితే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మెడిసిన్, మానవాళి ప్రయాణం దిశా నిర్ధేశాలు మార్చేసింది. ఇందుకు తార్కాణం గడిచిన గత పన్నెండు సంవత్సరాలు.
గడిచిన గత పన్నెండు సంవత్సరాలు
2010 నుండి మొదలుకొని 2022 నాటికీ మానవాళి జనాభా 7 బిలియన్ నుంచి 8 బిలియన్ కు చేరుకుంది. అంటే, మొదటి 1 బిలియన్ కి 300 వేల సంవత్సరాలు పడితే, చివరి 1 బిలియన్ జనాభా కి కేవలం 12 సంవత్సరాలు పట్టింది
భూమి మీద మానవుల జనాభా
భూగ్రహం మీద మానవుల జనాభా 9 బిలియన్లు చేరుకోవడానికి ఇంకా 15 సంవత్సరాలు పడుతుంది అని ఐక్యరాజ్యసమితి నిపుణల అంచనా. అంటే 2037 లో ఈ భూగ్రహం మీద మొత్తం జనాభా 9 బిలియన్లు ఉంటుంది
ఈ జనాభా పెరుగుదల చాలా వరుకు అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి అని గమనార్హం, ప్రపంచంలోని ఆ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ చైనాను అధిగమించింది
ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ పాపులేషన్ ప్రోస్పెక్ట్స్’ అంచనా ప్రకారం, 2080 లోపు మనుషుల జనాభా 10.4 బిలియన్ చేరుకోనుంది, అయితే పెరుగుతున్న జనాభా కు కనీస ఆహార భద్రత, త్రాగు నీరు ఎలా అందించాలి అనేది శాస్త్రవేత్తల ముందు ఉన్న కీలక ప్రశ్న
Published by Deepak Rajula for NewsOrbit