Eatela Rajendar: కేసీఆర్ త‌ర్వాత ఈట‌లే… గులాబీ పార్టీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

Share

Eatela Rajendar: ఊహించిన‌ట్లే తెలంగాణ రాష్ట్ర స‌మితికి గుడ్ బై చెప్పేసిన సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ త‌ను ఇన్నాళ్లు కొన‌సాగిన పార్టీ గురించి సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి తెస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి గుడ్ బై చెప్పేసిన స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. అయితే, టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఎదురుదాడి మొద‌లుపెట్టాయి. తాజాగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఈట‌ల పై విరుచుకుప‌డ్డారు.

Read More: Eatela Rajendar: నేడే విడుద‌లః ఈట‌ల రాజీనామా చివ‌రి నిమిషంలో ట్విస్టులు

కేసీఆర్ కు వారే హైక‌మాండ్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌‌ను వీడాలనుకుంటే బర్తరఫ్ చేసిన రోజే వీడాల్సిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఈటల ఆత్మగౌరవం కోసం కాకుండా ఆత్మరక్షణకు పోరాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఈటల చేసిన సేవ కంటే ఆయనకు సీఎం కేసిఆర్ ఎక్కువగానే పదవులు, బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీలో ఆయన చేరుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌‌పై ఈటల విమర్శలను ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఐదేళ్లుగా అవమానం జరుగుతుంటే ఆత్మగౌరవం కోసం ఈ రోజు వరకు ఎందుకు ఊరుకున్నారు? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ తనకు తెలంగాణ ప్రజలే హై కమాండ్ అని అనుకున్నారు కాబట్టి సామాన్యుని ఫిర్యాదులపై స్పందించి మంత్రి అని కూడా చూడకుండా బర్తరఫ్ చేశారు అని పేర్కొన్నారు.

Read More: Harish Rao: ఈట‌లపై కేసీఆర్ కొత్త గేమ్‌… హ‌రీశ్ రావు ఏం చేశారో తెలుసా?

కేసీఆర్ త‌ర్వాత ఈట‌లే…

మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీ మీద ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని పల్లా అన్నారు. ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు, రాజకీయ అవగాహన లేకున్నా కూడా ఈటలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకుని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని పల్లా అన్నారు. ‘కేసీఆర్ ఈటలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో కేసీఆర్ తర్వాత అన్ని పదవులు అనుభవించింది ఈటల మాత్రమే. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈటల ఆత్మగౌరవ నినాదం ముందుకు తీసుకొస్తున్నారు.` అంటూ విరుచుకుప‌డ్డారు.


Share

Related posts

ఏంటిది జ‌గ‌న్‌…ఈ మాట నిజ‌మైతే ఏం జ‌రుగుతుందో తెలుసా?

sridhar

Kodali Nani : చంద్రబాబు కి ఊహించని సవాల్ విసిరిన కొడాలి నాని..!!

sekhar

పట్టాభి గురించి వైకాపా – టీడీపీ లో బ్యాక్ టూ బ్యాక్ డిస్కషన్ లు ! 

sekhar