Eatela Rajendar: ఈట‌ల ఇలాకాలో బీజేపీ కొత్త ప్లాన్‌… దుబ్బాక రిపీట్ అవుతుంద‌ట‌

Share

Eatela Rajendar: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజురాబాద్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఉపఎన్నిక కోసం మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల గేమ్ మొద‌లైంది… ఆయ‌న కోసం ఎవ‌రు వ‌చ్చేశారో తెలుసా?

వీళ్లే ఇంచార్జీలు…

బీజేపీ హుజురాబాద్ ఎన్నిక‌ల‌కు ఇంచార్జీల‌ ను ప్ర‌క‌టించారు. హుజురాబాద్ టౌన్ కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అరవింద్ ను ఇంచార్జ్ గా నియమించారు. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ను ఇంచార్జ్ లుగా నియమించారు. కోఆర్డినేటర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అపాయింట్ చేశారు. కో ఇంఛార్జ్ లుగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణలను నియమించారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల కు అప్పుడే బీజేపీలో పొగ పెడుతున్న సీనియ‌ర్‌

ర‌ఘునంద‌న్ రావు కీల‌క వ్యాఖ్య‌లు
హుజురాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌‌గా నియమితుడైన సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.కార్యకర్తలు అంచెలంచెలుగా ఎదిగేందుకు సరైన వేదిక బీజేపీ అని అన్నారు. దుబ్బాక విజయం హుజురాబాద్‌లో కూడా రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఈట‌ల రాజేంద‌ర్ కే ఉంద‌ని ర‌ఘునంద‌న్ రావు తెలిపారు .


Share

Related posts

యధా సీఎం …తధా ఎమ్మెల్యే !న్యాయమూర్తులపై నాలికకు పనిపెడుతున్న వైసిపి నేతలు!!

Yandamuri

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం… నేటి పోలింగ్‌లో ఆ రికార్డు సొంతం

sridhar

ఆయనకు విశ్వసనీయత లేదు: రాహుల్

somaraju sharma