Eatela Rajendar: ఈట‌ల గేమ్ మొద‌లైంది… ఆయ‌న కోసం ఎవ‌రు వ‌చ్చేశారో తెలుసా?

Share

Eatela Rajendar: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రాతినిథ్యం వ‌హించిన ముజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈట‌ల రాజీనామాతో త్వ‌ర‌లో ఇక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టికే అక్క‌డ త‌న ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తాజాగా ఆయ‌న కోసం ఇటు ఆయ‌న స‌తీమ‌ణి ఈట‌ల రాజేంద‌ర్‌… అటు ఓయూ జేఏసీ విద్యార్థులు ఈట‌ల కోసం ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల కు అప్పుడే బీజేపీలో పొగ పెడుతున్న సీనియ‌ర్‌

భ‌ర్త కోస‌మ జ‌మున‌…

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని కమలాపూర్ మండలంలో ఈటల సతీమణి జమున ప‌ర్య‌టించారు. మాజీ జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌తో తుల ఉమతో క‌లిసి స్థానిక మ‌హిళ‌ల‌తో ఆడిపాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నామని.. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొంటామన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికే తాము బీజేపీలో చేరామన్న విమర్శలు సరికాదన్నారు. 2000 సంవత్సరం కంటే ముందు నుంచే తమకు ఆస్తులు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం నడపడానికి తాము చాలా ఖర్చు పెట్టామని జమున తెలిపారు. ఆరోజు ఎప్పుడూ కూడా తమ్మీ ఎక్కడినుండి డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నావని కేసీఆర్ అడగలేదన్నారు. కానీ ఈ రోజు విమర్శ‌లు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Read More: Eatela rajendar: టీఆర్ఎస్ లో ఎద‌గాలంటే… ఈట‌ల‌ను తిట్టాల్సిందే

ఓయూ జేఏసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ పుల్లారావు యాదవ్ తెలిపారు. ఈటల రాజేందర్ సహకరించకుంటే తాము ఉద్యమం చేసేవాళ్లం కాదన్నారు. దమ్ముంటే కేసీఆర్ స్వయంగా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పై పోటీ చేయాలన్నారు. దండుపాళ్యం దండులాగా టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, దొర రాసిచ్చిన స్క్రిప్టును కౌశిక్ రెడ్డి చదువుతున్నాడన్నారు. ఈటల రాజేందర్ కు విద్యార్థి శక్తి, ఉద్యమకారులు అండగా ఉన్నారన్నారు. ఈటల హుజురాబాద్ కే కాదని..తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధి అన్నారు. ఈటలను హుజురాబాద్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేందుకు బాటలు వేయాలన్నారు. ఈటలపై అవాకులు చెవాకులు పేలితో ఊరుకోబోమని, ఉస్మానియా విద్యార్థులంతా ఈటలకు అండగా ఉంటామని స్ప‌ష్టం చేశారు.


Share

Related posts

గ్రేట‌ర్ ఫైట్ః కేసీఆర్‌ కు షాకిచ్చిన ఎంఐఎం ?

sridhar

Covid Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో కేంద్రం కీలక మార్గదర్శకాలు ఇవీ…

somaraju sharma

87 ఏళ్ల వ‌య‌స్సులో ఇంటింటికి వెళ్లి కరోనా వైద్యం అందిస్తున్న వృద్ధ డాక్ట‌ర్ !

Teja