Eatela Rajendar: ఈట‌ల బ్యాలెన్స్ త‌ప్పుతున్నారా? ఏంటా మాట‌లు….

Share

Eatela Rajendar: హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ త‌ర‌ఫున మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో ఉంటుండ‌గా… టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అభ్య‌ర్థిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అయితే, టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారైన అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేసేందుకు చాన్స్ ఇస్తున్నాయ‌ని అంటున్నారు.

Read More: Eatela Rajendar: నాడు జానారెడ్డి… నేడు ఈట‌ల రాజేంద‌ర్‌… ఏంటీ షాకుల పరంప‌ర‌?

ఈట‌ల ఏమ‌న్నారంటే..
టీఆర్ఎస్ త‌ర‌ఫున‌ గెల్లు శ్రీనివాస్ యదవ్ ను హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ స్పందిస్తూ, మ‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించేందుకు ఉద్య‌మ‌కారుడు కావాలా…బానిస బిడ్డ కావాలా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ మండిప‌డుతోంది. నిఖార్సయిన ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన గెల్లును టీఆర్ఎస్ రంగంలోకి దింపడాన్ని ఈట‌ల‌ జీర్ణించుకోలేకపోతున్నాడని, టీఆర్ఎస్ పార్టీకి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌తో ఈటల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని మండిప‌డుతున్నారు.

Read More: KCR: కేసీఆర్‌కు ఏకు మేకు అవుతున్న ద‌ళిత‌బంధు!


ప్ర‌తిప‌క్షాల‌కు దొరికిపోయిన‌ట్లేనా?
ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ నేప‌థ్యంలో టీఆర్ఎస్ వ‌ర్గాలు ఆయ‌న‌పై ఎదురుదాడి చేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక, టీఆర్ఎస్ అభ్యర్థిపై అప్పుడే ఇలాంటి కామెంట్లు చేయడమేంటని మండిపడుతున్నారు. గెల్లును టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో కులసంఘాల మీటింగ్ లో ఉన్న రాజేందర్ టీఆర్ఎస్ టికెట్ ను బీసీ బిడ్డకు కేటాయించడాన్ని తెలుసుకుని నోరెళ్లబెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ బానిస బిడ్డ కావాలా.. లేక పోరాడేవాళ్లు కావాలా అంటూ నోటికొచ్చిన భాష ఉపయోగించడం ఏంట‌ని పేర్కొంటున్నారు.


Share

Related posts

ఒక్కసారిగా మీడియా పై సీరియస్ అయిన కేటీఆర్…!!

sekhar

జొన్న‌ల‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Teja

ఒక్కసారిగా అనసూయ స్టేజి మీద ఎందుకు ఏడ్చింది?

Naina