Eatela rajendar: ఈట‌ల చేసిన ప‌నికి కేసీఆర్ టెన్ష‌న్ ప‌డ‌పోతున్నారుగా

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Share

Eatela rajendar: సీనియ‌ర్ రాజకీయ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోందని, కేసీఆర్ అసలు రాజ్యాంగం, ఎమ్మెల్యేలు ఎందుకు అనే భావనలో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు రావని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో కురుక్షేత్ర యుద్ధంలో జరగబోతోందని ఆయ‌న పేర్కొన్నారు. ఈట‌ల విమ‌ర్శ‌లు అలా ఉంచితే, ఆయ‌న రాజీనామా కార‌ణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఊహించ‌ని రీతిలో ఇరుకున ప‌డుతున్నార‌ని అంటున్నారు.

Read More: Eatela Rajendar: రాజీనామాతో రెండు రికార్డులు సృష్టించిన ఈట‌ల‌

ఈట‌ల ఎఫెక్ట్ మామూలుగా లేదుగా…

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్న స‌మ‌యంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ విష‌యం తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌మ‌నించాల‌ని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. పార్టీ మారుతున్న నేప‌థ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి ఈట‌ల రాజేంద‌ర్‌ రాజీనామా చేశార‌ని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అదే రీతిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి.. టీఆర్ఎస్ లో చేరి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యులతో రాజీనామా చేయించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నైతిక విలువలకు కట్టుబడాలని పొన్నం డిమాండ్ చేశారు.

Read More: Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

కొత్త డిమాండ్ వ‌ల్ల స‌మ‌స్యే…

ఈట‌ల రాజేంద‌ర్‌ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ బీజేపీ లో చేరుతున్న త‌రుణంలో స‌హ‌జంగానే మిగ‌తా జంపింగ్ ఎమ్మెల్యేల సంగ‌తి ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. ఈట‌ల చేసిన‌ట్లే వారెందు రాజీనామా చేయ‌రు? తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న ప్ర‌బుత్వానికి పూర్తి మ‌ద్ద‌తు ఉన్న‌ప్ప‌టికీ వారితో రాజీనామా చేయించి ఎందుకు ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేదు అన్న కామెంట్లు స‌హ‌జంగానే టీఆర్ఎస్ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఎక్కుపెడుతున్నాయి.


Share

Related posts

Corona Aid: కరోనా బాధిత మృతుల కుటుంబాలకు లక్ష సాయం..! ఎక్కడంటే..?

somaraju sharma

Hema : తిరుపతి సభలో సినీనటి హేమ షాకింగ్ కామెడీ..! రగిలిపోతున్న బీజేపీ పెద్దలు..!!

Yandamuri

“చెత్త” లంబోర్ఘిని.. చూశారా ఎప్పుడైనా

bharani jella