Eatela Rajendar: ఎమ్మెల్యే చచ్చిపోవాల్సిందే… ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

Share

Eatela Rajendar: తెలంగాణ రాష్ట్ర స‌మితి మాజీ నేత‌, బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఇలాక అయిన హుజురాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉప ఎన్నిక‌ల‌కు ముంద‌స్తుగా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో త‌న శైలికి భిన్నంగా దూకుడుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘హుజురాబాద్‌లో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరవుతున్నాయని సోషల్ మీడియాలో చూశాను. దాంతో మా ఎమెల్యే రాజీనామా చేస్తే బాగుండని లేకపోతే ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండని అన్ని నియోజకవర్గాల్లో జనం అనుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.“అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దొర అంటూ కామెంట్లు

నేను మంత్రిగా ఉన్న‌ప్పుడే…
తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి అనేక నిధులు ఇప్పించానని పేర్కొన్న ఈట‌ల రాజేంద‌ర్ రెండు మూడేళ్లుగా చేసిన పనులకే డబ్బులు లేవని అన్నారు. “పనులు చేసి నిధులు రాక అప్పులు పాలై.. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లున్నారు. ఇప్పుడేమో ఎన్నికలు వస్తున్నాయని మూడు రోజులుగా ఈ నిధులు విడుదల చేస్తున్నారు. కేసీఆర్ ఈ మధ్య అనేక సభలలో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు వింటే ధర్మానికి ప్రతిరూపమని, మాట తప్పని మనిషని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అసలు రంగు వేరే ఉంది. పరకాల ఎమ్మెల్యేతో నీచపు పనులు చేయిస్తున్నాడు. కానీ, కేసీఆర్ మాత్రం డబ్బులు, కుట్రలు, మోసాన్ని నమ్ముకుంటాడు. ఆయన ధర్మాన్ని నమ్మరు. ఈ కుట్రలకు హుజురాబాద్ నియోజకవర్గం చరమగీతం పాడబోతోంది.“ అని ఈట‌ల ప్ర‌క‌టించారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల గేమ్ మొద‌లైంది… ఆయ‌న కోసం ఎవ‌రు వ‌చ్చేశారో తెలుసా?

ఈట‌ల రాజేంద‌ర్ వాటికి వ్య‌తిరేకా?
తాను రైతుబంధు వద్దన్నాన‌ని, కేసీఆర్ కిట్లు వద్దన్నానని అబ‌ద్దాపు ప్రచారం చేస్తున్నారని ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. “ నేను అలా అనలేదు. ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి. కానీ, పెద్దల కోసం పనిచేస్తోంది. కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి.. బలహీనంగా ఉండే కొడుకులు, బిడ్డల పట్ల ఆలోచన చేయాలి. ఎస్సీలు, బీసీలు ఉపాధి కోసం లోన్లకు వెళ్తే సర్కారు ఇవ్వడం లేదు. కానీ, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు మాత్రం లోన్లు ఇస్తోంది. వందల ఎకరాల భూములన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఎలా ఇస్తారని మాత్రమే అడిగా. అది తప్పా?“ అని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్నించారు.


Share

Related posts

Kanabadutaledu: కనబడుటలేదు టీజర్ ఇంట్రెస్టింగ్.. సాల్వ్ ద పజిల్….!!

bharani jella

నాగ చైతన్య కి వాటి మీద ఆసక్తి ఎక్కువవవుతోందా ..?

GRK

Narendra Modi : మోడీ ఊహించ‌ని కామెంట్స్ చేస్తున్న‌ సీఎం అభ్య‌ర్థి

sridhar