Ola Electric Scooter: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్ లే బెటర్ అని కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులు డైలమాలో పడిపోయే పరిస్థితి నెలకొంది. కారణం చూస్తే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు పేలిపోవడం.. కొంతమంది మరణిస్తూ ఉండడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ అదేవిధంగా విజయవాడలో .. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో.. ఇంకా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లలోనే ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉండటంతో… ఒక్కసారిగా ఊహించనివిధంగా బైకులు పేలడంతో.. ఇంటిలో ఉన్న మనుషులు తీవ్ర గాయాలకు.. లోనవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలపై భారీ ఎత్తున ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ లు ఎక్కువ మార్కెటింగ్ చేసే కంపెనీగా పేరొందిన ఓలా షాకింగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మ్యాటర్ లోకి వెళ్తే..1441కి పైగా తన S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లను ఓలా రీసెంట్ గా రీకాల్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ లను దాన్ని సర్వీస్ ఇంజినీర్ల ద్వారా మొత్తం క్షణ్ణంగా పరిశీలించి.. ఎటువంటి ఫాల్ట్ ఏమైనా వాహనంలో ఉందా అనేదాన్ని పరీక్షించడానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ రెడీ అయింది. దేశ వ్యాప్తంగా ఎక్కువగా ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వాహనాలు పెలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.