NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Elon Musk: ట్విట్టర్ కొనుగోలు అంశంపై కిరికిరి..! ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్

Elon Musk: అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసుకునేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫేక్ ఖాతాల విషయంలో కిరికిరి నెలకొనడంతో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. ఫేక్ ఖాతాల విషయంలో ఎలాన్ మస్క్ అనుమానాల కారణంగా ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం విషయంలో బ్రేక్ పడే సూచనలు కనబడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చే విధంగా ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు.

Elon Musk Twitter Deal on hold
Elon Musk Twitter Deal on hold

Read More: CM YS jagan: ఏపిలో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్..ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే..?

 

Elon Musk:ఫేక్ ఖాతాల సంఖ్య తేలిన తర్వాతే..

ట్విట్టర్ కొనుగోలు అంశంకు సంబంధించి ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లో ఫేక్/స్పామ్ ఖాతాలు మొత్తం యూజర్ల సంఖ్యలో అయిదు శాతం కంటే తక్కువ ఉన్నాయని నిరూపించకపోతే ఆ సంస్థ కొనుగోలు ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కష్టమని పేర్కొన్నారు ఎలాన్ మస్క్. షేక్ యూజర్ల సంఖ్య అయిదు శాతం కన్నా తక్కువే ఉండవచ్చని ట్విట్టర్ చెబుతుండగా, అది 20 శాతం ఉండవచ్చని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకూ ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు మస్క్.

తాత్కాలిక బ్రేక్..?

“ట్విట్టర్ లో 20 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉండొచ్చు. ట్విట్టర్ సంస్థ చెబుతున్న దానికి ఇది నాలుగు రెట్లు ఎక్కువ. అయిదు శాతం కన్నా తక్కువే స్వామ్ ఖాతాలు ఉన్నాయని బహిరంగంగా రుజువు చేయడానికి ట్విట్టర్ సీఈఓ నిరాకరించారు. ఆయన రుజువు చేసే వరకు డీల్ ముందుకు సాగదు” అని మస్క్ తాజాగా పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలోనూ వెల్లడించారు మస్క్. ట్విట్టర్ కు తాను ముందుగా ప్రకటించిన 44 బిలియన్ డాలర్ల కన్నా తక్కువకే చెల్లించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.  ఫేక్/స్పామ్ ఖాతాల విషయంలో నెలకొన్న పేచీ (కిరికిరి) కారణంగా ఈ కొనుగోలు అంశంలో తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju