Energy Drink: ఈ రోజుల్లో చిన్న వయసు వారైనా, పెద్ద వయసు వారైనా ఏ పని చేయాలన్నా అలసట, నిస్సత్తువ ఏర్పడుతున్నాయి.. ఇందుకు కారణం కాల్షియం లోపమే.. అంతేకాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలలో తక్షణ శక్తిని అందించే వాటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి..!! తక్షణ శక్తిని అందించే అద్భుతమైన చిట్కా ఉంది..!! ఈ చిట్కాను పాటిస్తే 60 వయసులో ఉన్నవారు కూడా 20 వయసులో వారిలా శక్తి వస్తుంది..!!

తక్షణ శక్తి కోసం పొడిని తయారు చేసుకునే విధానం..!!
ఈ చిట్కా కు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, 10 బాదం పప్పులు అవసరం.. వీటిని తీసుకుని పొయ్యిమీద బాండీ పెట్టి దోరగా వేయించుకోవాలి.. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి పౌడర్ లా చేసుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు పాలలో కలుపుకుని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఇది శరీరంలో క్యాల్షియం లోపం తగ్గించడానికి సహాయపడుతుంది.. నిద్రలేమి సమస్య నుండి బయటపడేస్తుంది. కొంత మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు.. అటువంటివారు ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా పొడిని కలుపుకుని తాగాలి. లేదనుకుంటే ఈ పొడిని తిని గ్లాసు వేడి నీటిని తాగిన నా చక్కటి ఫలితం పొందుతారు.. రాత్రిపూట పాలని రాసేటప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పొడిని వేసి ఎర్ర బెల్లం లేదా కలకండ వేసుకోవచ్చు. చక్కెర ను వాడకపోవడమే మంచిది.. పాలలో, బెల్లం లో కూడా క్యాల్షియం ఉంటుంది.. దీని ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి ఈ పొడి వరంగా చెప్పుకోవచ్చు.. శరీరంలో క్యాల్షియం లోపిస్తే దంతాలు, గుండె సమస్యలు వస్తాయి. ఎముకలు పెళుసుగా మారి చిన్న చిన్న దెబ్బలు కూడా ఎముకలు విరిగి పోతూ ఉంటాయి.. కాల్షియం లోపించడం వలన వెన్ను నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు..
ఆరోగ్యానికాఆరోగ్యం.. అందానికందం..!!
గసగసాలు కూడా సుగంధద్రవ్యాల లాగానే పనిచేస్తుంది. ఇందులో క్యాల్షియం, మినరల్స్, విటమిన్స్, యాంటీబయోటిక్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.. గసగసాలు శరీరానికి చలవ చేస్తాయి.. గసగసాలను మితంగా తీసుకుంటే కడుపు సంబంధిత, జీర్ణసంబంధిత సమస్యలు నుండి బయటపడేస్తుంది. గసగసాలు జుట్టు, చర్మ, దగ్గు, ఆయాసం, తలనొప్పి నివారణకు చక్కగా పనిచేస్తాయి.. బాదం పప్పులు ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. న్యూట్రీషన్లు సూచించే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటి.. పోషకాల గని గా బాదంపప్పు ను చెప్పుకోవచ్చు.. అనేక రోగాల నుండి బాదం పప్పు రక్షిస్తుంది. నువ్వులు శరీరానికి మేలు చేస్తాయి.. నువ్వులను అధిక శాతం ఫైబర్ ఉంటుంది.. మంచి ప్రోటీన్ ఫుడ్ గా నువ్వు లను సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.. శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి నువ్వులు దోహదపడతాయి. అటువంటి పోషక విలువలు కలిగిన నువ్వులు గసగసాలు బాదం లు కలిపి చేసుకున్న పొడి ప్రతిరోజు తీసుకుంటే తక్షణ శక్తి అందడమే కాకుండా నిత్య యవ్వనంగా కనిపిస్తారు..