Energy Food: ఈ లడ్డు ఒకటి తినండి చాలు.. వైద్యుడి దగ్గరకు వెళ్ళనవసరం లేదు..!!

Share

Energy Food: మన అమ్మమ్మలు, బామ్మలు మనకంటే ఆరోగ్యంగా ఉంటారు.. ఇంత వయసులో కూడా వారు ఓపిక గా పని చేస్తూ ఉంటారు.. మనతో పోలిస్తే 10 రెట్లు చురుకుగా ఉంటారు.. వారు ఎంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం వారు తీసుకునే ఆహారమే.. మన ఇటీవల కాలంలో ఇంట్లో తినుబండారాలు చేసుకుని తినడం మర్చిపోయాను బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, రకరకాల ఆహారాలు తినటానికి మక్కువ చూపిస్తున్నాం.. అందులో ఏం కలిపారో ఎలా చేశారో మనకే తెలీదు.. కానీ వాటిని మనం ఇష్టంగా లాగించేస్తన్నాము.. బోనస్ గా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. అయితే మన బామ్మలు తయారు చేసుకుని తిన్న ఈ లడ్డు తింటే అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే ఉండదు.. ఆ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

 

Energy Food: for everyone
Energy Food: for everyone

Energy Food: ఈ ఒక్క లడ్డు తో అన్ని సమస్యలకు చెక్..

కావలసిన పదార్థాలు:

తెల్ల నువ్వులు – 100 గ్రాములు, గుమ్మడి గింజలు – 100 గ్రాములు, దోస పప్పు – 100 గ్రాములు, ఎండు నల్ల ద్రాక్ష – 100 గ్రాములు, ఎండు ఖర్జూరం – 100 గ్రాములు, పటిక బెల్లం పొడి – 100 గ్రాములు, నెయ్యి – 100 గ్రాములు.

పైన చెప్పిన గింజలను విడి విడిగా ఒక బాండీలో వేసి దోరగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు, ఎండు ఖర్జూరం, గుమ్మడి గింజలు, దోసకాయ పప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. విడిగా పటిక బెల్లం పొడి చేసుకోవాలి. చివరిగా ఎండుద్రాక్ష మిక్సీ పట్టుకోవాలి. వీటన్నింటిని ఒక పళ్లెంలో పోసి అన్నింటిని కలుపుకోవాలి. ఇందులో నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండలను నేను ఒక ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న లడ్డూను ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినాలి. ఇలా తింటే శరీరానికి కావాల్సిన బలం లభిస్తుంది.

Energy Food: for everyone
Energy Food: for everyone

ఈ లడ్డు తయారీలో ఉపయోగించిన అన్నీ పదార్థాలలో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ లడ్డూను సంపూర్ణ ఆహారంగా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. ఈ లడ్డూను తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్త హీనత సమస్యలను తగ్గిస్తుంది. శరీరానికి బలం అందిస్తుంది . అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది ప్రతిరోజు ఈ లడ్డూను తింటే హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరమే రాదు. మీరు కూడా ఈ పోషకాల లడ్డు ని తయారు చేసుకొని పిల్లలు, పెద్దలకు అందరికీ అందించండి.

Energy Food: for everyone
Energy Food: for everyone

Share

Related posts

దేవినేని ఉమా .. గుట్టు మొత్తం రట్టు అయ్యిందిగా !

sridhar

కీర్తి అకౌంట్ లో సినిమాలు ఎక్కువయ్యానే రిలీజ్ అనుకున్న సినిమాని అలా వదిలేశారా ..?

GRK

బిగ్ బాస్ 4: రేస్ టు ఫినాలే టాస్క్ లో ఇంటి సభ్యుల కు చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు…!!

sekhar