EPFO: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఈపిఎఫ్ఓ విడుదల చేసింది.సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీసులో ఉన్నవారు, అటు తర్వాత సర్వీసులో కొనసాగుతున్న వారికి అధిక పెన్షన్ ఆప్షన్ను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు మరో రెండు వారాలలో ముగిసిపోతున్నది. ఈ తరుణంలో హడావుడిగా ఉద్యోగులు, యాజమాన్యాలు అనుసరించాల్సిన విధి విధానాలను ఈపీఎఫ్ఓ జారీ చేసింది.

ఈపీఎఫ్ 2014లో చేసిన సవరణల మేరకు పెన్షనబుల్ వేతన పరిమితిని నెలకు రూ.6500 నుండి రూ.15000 వరకు పెంచింది. ఈ పరిమితికి లోబడి అందులో 12% పలు యాజమాన్యాలు పిఎఫ్ కంట్రిబ్యూషన్ గా ఉద్యోగుల నుంచి జమ చేస్తున్నారు. అంటే మొత్తం యాజమాన్యం సమకూరుస్తున్నది. యాజమాన్యం చెల్లించిన దానిలో 8.33% ఈపీఎస్ కు మళ్ళిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు బేసిక్+డి ఎ పై ఉద్యోగుల గురించి డిడక్ట్ చేస్తూ, అంత మొత్తాన్ని అవి సమకూరుస్తున్నాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఉమ్మడిగా అధిక పెన్షన్ ఆప్షన్ను ఎంపిక చేయాలి. ఇందుకు సంబంధించి ఒక ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించారు. ఈ యు ఆర్ ఎల్త్ ఉద్యోగులు డిజిటల్ గా లాగిన్ అయ్యి, దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు రసీదు నంబర్ను కేటాయిస్తారు. ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు యజమాని లాగిన్ లోకి వెళుతుంది దానిని యజమాని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి. ఈ విధంగా పిఎఫ్ కమిషనర్ నిర్దేశించిన ఫారంలో అధిక పెన్షన్తో కోరుతూ ఉద్యోగాలు వారి యాజమానితో కలిపి ఉమ్మడిగా దరఖాస్తు చేయాలి. జాయింట్ డిక్లరేషన్ తదితర డాక్యుమెంట్లను జత చేయాలి. ప్రాంతీయ ప్రావిడెంట్ కార్యాలయం అధికారి దరఖాస్తులోని వాస్తవ వేతనంపై అధిక పెన్షన్ ఉమ్మడి ఆక్షన్ పరిశీలించి నిర్ణయాన్ని దరఖాస్తుదారుకి ఈమెయిల్ లేదా పోస్ట్ తదుపరి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఉమ్మడి ఆప్షన్ ఫారం సమర్పించిన తర్వాత దరఖాస్తుదారు ఏమైనా ఫిర్యాదు చేయదలిస్తే ఈపీఎఫ్ ఐ జి ఎం ఎస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అర్హమైన చందాదారులకు/ఉద్యోగులకు అధిక పెన్షన్ ఆప్షన్ను అందించాలంటే ఈపీఎఫ్ఓ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది.