Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో గత శనివారం నుండి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం ఓటిటి లో ప్రసారమౌతున్న ఈ రియాల్టీ షో కి పెద్దగా ఆదరణ కనబడటం లేదు. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని… ప్రోమోలలో… ప్రచారం చేసినా గాని కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా వారిలో… ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్ లు కాగా… తొమ్మిది మంది కొత్త వాళ్లు.
దీంతో కొత్త వాళ్లను పాత వాళ్లను.. రెండు జట్లుగా బిగ్ బాస్ విభజించటం జరిగింది. కొత్త టీం సభ్యులకు ఛాలెంజర్స్ అని, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు వారియర్స్ అని టీం లకు పేర్లు పెట్టడం జరిగింది. ఈ రెండు రెమ్మల మధ్య హోరాహోరీ పోటీ టాస్కులు జరుగుతున్నయి. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ తరుణంలో వారియర్స్ టీం లో… మెజార్టీ సభ్యులు కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్, అరియనా… పేర్లు సూచించటం ఫైనలైజ్ చేయడం జరిగింది.
ఇక ఇదే జట్టులో ఉన్న అషూ రెడ్డి… తాజా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండానే… అర్ధరాత్రి పూట తన బెడ్ పైన గుక్కపెట్టి ఏడుస్తుంది. దీంతో చాలామంది ఈ సన్నివేశం చూసి ఇ సీజన్ త్రీ లో గ్లామర్ చూపిస్తే ఇప్పుడు మాత్రం అశూ రెడ్డి… సంపతి సంపాదించుకోవడానికి తెగ తాపత్రయ పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటిటి బిగ్ బాస్ పెద్దగా ఏమీ లేదని దీనికంటే టెలివిజన్ లో ప్రసారమయ్యే … గంట ఎపిసోడ్ చాలా బెటర్ అని చూస్తున్న ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.