Appetite: ఆకలిగా లేదా..!? ఆత్మా రాముడితో కేకలు పెట్టించండిలా..!!

Share

Appetite: విస్తర్లో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నా కొందరికి ముద్ద నోట్లోకి దిగదు. అదేంటంటే ఆకలిగా లేదు అంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ.. తరచుగా ఇదే అయితే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం.. ఈ సమస్యకి మన వంటింట్లో ఉండే ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!! ఇవి తింటే ఆత్మా రాముడితో కేకలు పెట్టించచ్చు..!!

Excellent Ayurvedic Remides For Appetite:
Excellent Ayurvedic Remides For Appetite:

జీర్ణ క్రియను మెరుగు పరిచే ఆహారాలు తీసుకోవాలి. అందులో ముందుండేది నిమ్మ కాయ. ఒక గ్లాసు నీటిలో చెంచా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగాలి. కాసేపటి తరువాత కచ్చితంగా ఆకలి వేస్తుంది. అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. అజీర్తి, ఆకలి మందగించటం ఉన్న వారు అల్లం ముక్క ను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతంటే జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. ఆకలిని పెంచుతుంది. రోజుకు ఇలా నాలుగు ముక్కలు తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ద్రాక్ష కూడా జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేసిన తరువాత కాసిన్ని ద్రాక్ష పండ్లు తింటే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఆకలిని పెంచుతుంది. ఎండు ద్రాక్ష తిన్న కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

Excellent Ayurvedic Remides For Appetite:
Excellent Ayurvedic Remides For Appetite:

పోషకాలు మెండుగా ఉన్న డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం ఉంది. వాస్తవానికి ఖర్జూరాలు తిన్న ఒక ఐదు నిమిషాలలో ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. ప్రతి రోజు నాలుగు ఖర్జూరాలు తింటే జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు ఆకలిని పెంచుతుంది. మెంతులు గ్యాస్ ను తగ్గిస్తాయి. దీంతో పాటు ఆకలిని పెంచుతుంది. ఒక స్పూన్ మెంతి పిండి లో కొంచెం తేనె కలుపుకుని తీసుకుంటే ఆకలిని పుట్టిస్తుంది. త్రిఫల చూర్ణం అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తీసుకుంటే ఆకలి వేస్తుంది. ప్రతి రోజు గ్రీన్ టీ తాగితే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.


Share

Related posts

జబర్దస్త్ : పాపం సుడిగాలి సుధీర్ .. స్టేజీ మీదే గాలి తీసేసిన ఎమ్మెల్యే రోజా !

sekhar

Amyra Dastur fantastic images

Gallery Desk

రవితేజ ని వెనక్కి లాగుతున్నారు… అందరిలో వణుకు పుట్టడమే కారణం ..?

GRK