Gangapayala Aku: ఇది పిచ్చి మొక్క కాదు.. పోషకాల మయం..!! ప్రయోజనాలేంటంటే..!?

Share

Gangapayala Aku: ఈ మొక్కను మనందరం చూసే ఉంటాం.. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్క గా భావించి పికేస్తుంటారు.. ఈ మొక్కను గంగ వాయల ఆకు, గంగ పాయలాకు, గంగ పావిలి, గోళీ ఆకు అని పిలుస్తారు. ఈ మొక్కలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదలరు..!!

Excellent Health Benefits Of Gangapayala Aku: Plant
Excellent Health Benefits Of Gangapayala Aku: Plant

గంగ వాయల ఆకు లో విటమిన్ ఏ, బి, కార్బోహైడ్రేట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకు ను కూర, పప్పు గా వండుకుని తినవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డుగా నిలిచే చెడు కొలెస్ట్రాల్ లేకపోవడంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Excellent Health Benefits Of Gangapayala Aku: Plant
Excellent Health Benefits Of Gangapayala Aku: Plant

ఈ మొక్కలో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ ఆకు లో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుల కూర తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే జింక్ ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేస్తుంది. ఈ ఆకు లను ముద్దగా నూరుకుని రసం తీసి ఆ రసాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.


Share

Related posts

కరోనా వైరస్ ప్రభావంతో కరీంనగర్ లో కర్ఫ్య్హూ వాతావరణం ..

Siva Prasad

బ్రేకింగ్: రాజధాని కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్ట్

Vihari

చంద్రబాబుకు ఏమైంది..!సెంటిమెంటా..!సానుభూతా..!?

somaraju sharma