Jaggery Tea: అలసటగా, ఒత్తిడిగా అనిపించినప్పుడు వేడి వేడి టీ తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.. ఇక టీ ప్రియులకు చాయ్ తాగనిదే రోజు మొదలవ్వదు.. బంధువులు, తెలిసినవారు ఎవరైనా ఇంటికి రాగానే వెంటనే వేడి వేడి టీ వారికి అందిస్తాం.. అయితే టీ లో ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తూ ఉంటారు.. ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చేస్తూ ఉంటాం.. అయితే పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగించండి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో..!? ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!
Jaggery Tea: బెల్లం టీ ఇలా తయారు చేసుకుని తాగితే.. ఈ ప్రయోజనాలు మీ సొంతం..!!
కావలసిన పదార్థాలు:
పాలు ఒక కప్పు, నీరు అర కప్పు , అల్లం చిన్న ముక్క, బెల్లం మూడు చెంచాలు, యాలుకలు 1, సోంపు ఒక టీస్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్.
ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో లో నీరు పోసి పాలు తప్ప మిగతా పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు చివరగా పాలు పోసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన తరువాత ఈ టీని వడపోసుకుంటే బెల్లం తాగడానికి సిద్ధం.. బెల్లం లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టీ ని సేవించాలి. శరీరంలో రక్తం, ఎర్రకణాల సంఖ్య పెరుగుతుంది.
దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్, పార్శ్వపు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నవారు ఈ టి లో సాధారణ పాలకు బదులుగా ఆవు పాలను కలుపుకుని బెల్లం టీ తయారు చేసుకుని తాగితే ఈ సమస్యలు త్వరగా తగ్గుతాయి.. బెల్లం టీ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తాయి. గుండెల్లో మంట, అజీర్తి , గ్యాస్, అసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. బెల్లం ను నేరుగా తినడానికి ఇష్టపడని వారు టీ తయారు చేసుకొని తాగితే దానిలో ఉండే ఖనిజలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అన్ని రకాల సీజన్లలో వచ్చే వైరల్ జ్వరాల ను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు తో బాధపడుతున్న వారు ఈ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. బెల్లం టీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.