NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Seema Chinthakaya: సీమ చింతకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Seema Chinthakaya: సీమ చింతకాయ.. పల్లెటూరి వారందరికీ దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. పట్టణాలలో కూడా ఈ మధ్య ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.. సీమ చింతకాయ లో గులాబీ ఎరుపు తెలుపు రంగులో ఉండే పదార్థం తీపి, వగరు కలగలిపిన రుచిలో ఉంటుంది. జిలేబీ ఆకారంలో చుట్టలుగా ఈ కాయలను జంగిల్ జిలేబి (Jungle Jilebi) అని కూడా అంటారు.. సీమ చింతకాయలలో పోషకాలు మెండుగా ఉన్నాయి.. వీటిని తింటే మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Excellent health benefits of Seema Chinthakaya:
Excellent health benefits of Seema Chinthakaya

Seema Chinthakaya: సీమ చింతకాయ తో ఈ వ్యాధులు పరార్..!!

 

సీమ చింతకాయల లో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి , డి తో పాటు ఖనిజ లవణాలు కూడా ఇందులో మెండుగా ఉన్నాయి. ఇంకా కాపర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, సొలబుల్ ఫైబర్, సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంది. సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి (Immunity) ని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను (Anti-aging) తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. అలాగే మొహం పై ముడతలు (Wrinkles) తగ్గి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.

Excellent health benefits of Seema Chinthakaya:
Excellent health benefits of Seema Chinthakaya

సీమ చింత కాయలను సాధారణ మహిళల కంటే గర్భిణీ స్త్రీలు (Pregnant Women) తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది . వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తాయి. నీరసం తగ్గిస్తుంది. ఈ కాయలలో క్యాల్షియం అధికంగా ఉండటం వలన తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఎముకలు (Bones) దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని (Constipation) నివారిస్తుంది.

 

Excellent health benefits of Seema Chinthakaya:
Excellent health benefits of Seema Chinthakaya

సీమ చింతకాయలు లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిని తినటం వలన త్వరగా ఆకలి వేయదు. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. దాంతో చిరుతిళ్ళ జోలికి వెళ్లరు. బరువు తగ్గాలనుకునే ( Weight Loss) వారికి చక్కటి పోషకాహారంగా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సీమ చింతకాయలలో అమైనో ఆసిడ్ డోపమైన్ ఉంటుంది. దీని వలన ఒత్తిడి (Stres) తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Excellent health benefits of Seema Chinthakaya:
Excellent health benefits of Seema Chinthakaya

ఈ సీమచింతకాయ లో సోలాబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ (Diabetes) ను నియంత్రణలో ఉంచుతుంది. అధిక రక్తపోటును (BP) తగ్గిస్తుంది. ఇంకా శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె (Heart) ఆరోగ్యాన్ని  మెరుగు పరుస్తుంది. రక్తనాళాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. తెలుసుకున్నారు కదా సీమ చింతకాయలు మన ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు ఇక నుంచైనా వీటిని తినటం ప్రారంభించండి.

author avatar
bharani jella

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju