F3 Movie: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా.. ఫ్రస్టేషన్ కు ఫన్ జోడించి తీసిన సినిమా ఎఫ్2.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా ఎఫ్3 ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది.. తాజాగా సినిమాలో హీరోల గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్ పాత్రతో పోలిస్తే వెంకటేష్ పాత్ర హైలెట్ అయిన సంగతి తెలిసిందే.. వరుణ్ తో పోలిస్తే వెంకటేష్ కే ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి.. అయితే ఎఫ్3 సినిమాలో మాత్రం వెంకటేష్ తో పోలిస్తే వరుణ్ తేజ్ కే ఎక్కువ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ అభిమానులు మాత్రం అనిల్ రావిపూడి వెంకటేష్ కు అన్యాయం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు..
ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల ఈ డేట్ కు ఎఫ్ 3 సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.. ఇప్పటికే ఈ సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ కాంబినేషన్ సీన్స్ పూర్తయ్యాయి.. కొన్ని కీలక సన్నివేశాలు మినహా మిగిలిన భాగమంతా పూర్తయింది. ఎఫ్2 లో ఉన్నట్టే అద్భుతమైన టైమింగ్ డైలాగ్స్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉంటాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?