సేఫ్ గాఉండండి ఇమ్మ్యూనిటి పెంచుకోండి అన్నమాటలు ఇప్పుడు రోజు వింటున్నాం.ఇలాంటి సమయం లో ఒక జ్యూస్ చాల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇది రోజు లోఒక్కసారిఅయినా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చెప్పటం ఎవ్వరి కి సాధ్యంకాదు.ఏమా జ్యూస్ కథ అంటారా… అదే ఏ,బి,సి జ్యూస్.ఏ అంటే ఆపిల్,బి ఫర్ బీట్ రూట్, సి ఫర్ క్యారెట్.ఇంకా ఈ జ్యూస్ తో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం . బీట్ రూట్స్,క్యారెట్ లో ఉండే ఫైబర్ వల్ల అరుగుదల బావుంటుంది.దానితో పాటూ కాన్స్టిపేషన్ సమస్య తగ్గి , జీర్ణ సమస్యలు ఉండవు . కిడ్నీ సమస్యలు కూడా ఉండవు.
ఈ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు దూరం చేస్తుంది .ఈ జ్యూస్ ఫ్రీరాడికల్స్ తో ఫైట్ చేయటం తో పాటు, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది. దానివలన హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మరియు శరీరం లో లివర్ , కిడ్నీస్ ,ఇంటస్టైయిన్స్ ,స్కిన్ ఈ నాలుగు భాగాలలో ఉండే విష పదార్థాలని బయటకి పంపిస్తాయి . అందువల్ల ఈ నాలుగు శరీర భాగాల సమస్యలు తొలగిపోతాయి .
విటమిన్ ఏ ,ఈ కాంబినేషన్, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వలన వచ్చే కళ్ళు పొడిబారడం సమస్య నుండికాపాడుతుంది . అంతేనా ఈ జ్యూస్ అందాన్ని కూడా పెంచుతుంది.. వయస్సు కనిపించనివ్వనంతగా స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది . కొన్ని రోజుల పాటు క్రమము తప్పకుండ వాడి ఫలితాన్ని ఆనందించండి .100 గ్రాముల ఆపిల్. , 300 గ్రాముల క్యారెట్ , 300 గ్రాముల బీట్ రూట్ , తీసుకుని జ్యూస్ చేసుకుని, ఒక చెక్క నిమ్మ రసం పిండి చల్లగా తాగండి, చర్మం మెరవటంతో పాటు ఆరోగ్యం బావుంటుంది.