Fahadh Faasil : సినిమా కథ కల్పితమైన.. యాక్షన్ మాత్రం ఒరిజినల్.. ఇక ఫైట్లు.. ఛేజ్ లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో షూట్ చేస్తూ ఉంటారు.. ఒకప్పుడు రిస్కీ స్టంట్స్ చేయడానికి డూప్ క్యారెక్టర్లను యూస్ చేసే వారు.. ప్రస్తుతం డూప్ వాడటానికి యాక్టర్స్ పెద్దగా ఇష్టపడట్లేదు.. సీన్ లో ఎంత రిస్క్ ఉన్నప్పటికీ.. తామే ఒరిజినల్ గా చేయడానికి ఇష్టపడుతున్నారు.. ఇలాంటప్పుడే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. తాజాగా మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ షూటింగ్ సమయంలో బిల్డింగ్ పై నుండి కింద పడ్డాడు..
మలయాళన్ కుంజ్ అని చిత్ర షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు చిన్న పాటి గాయాలు మాత్రమే అయ్యాయి. బిల్డింగ్ పై నుంచి కింద పడిన వెంటనే యూనిట్ సభ్యులు అతడిని కొచ్చి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఫహద్ ఫాజిల్ ముక్కుకు గాయాలు అయ్యాయి. గాయం పెద్దదే అయినప్పటికీ , ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.