Family Drama: సుహాస్ కొత్త సినిమా “ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ వైరల్..!!

Share

Family Drama: కమెడియన్ ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్.. విజేత, పేపర్ బాయ్, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతి రోజు పండగ సినిమా లలో తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఇటీవల కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయమై తొలి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. తాజాగా సుహాస్ నటిస్తున్న “ఫ్యామిలీ డ్రామా” చిత్రం నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్..!! టైటిల్ కి డిఫరెంట్ గా ఫస్ట్ లుక్ ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

Family Drama: Suhas First look out
Family Drama: Suhas First look out

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో మోహర్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలిమ్స్, భారతి ఫిలిమ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ల పై తేజ కాసరపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామకృష్ణ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈచిత్రానికి అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం లోని మిగతా తారాగణం నుంచి వెల్లడించనున్నారు. ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు సుహాస్. కలర్ ఫోటో తో ఇట్లు తన ఖాతాలో వేసుకున్న సుహాస్ ఈ సినిమాతో కూడా మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.


Share

Related posts

అటుకుల లడ్డుతో కరోనాకు చెక్.. ఎలా అంటే?

Teja

Hamsa Nandini Beautiful Stills

Gallery Desk

మ‌గ‌తనం గురించి అవేం మాట‌లు కేసీఆర్ సార్‌?!

sridhar