IPL 2022: ఐపీఎల్ లోకి మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చిన టీం లలో గుజరాత్ టైటాన్స్ 15వ సీజన్ ఐపీఎల్ కప్పు కొట్టేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఫైనల్లో విజయభేరి మోగించింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 131 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వటం జరిగింది. దీంతో సెకండ్ బ్యాటింగ్ కి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 131 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేదించింది.
బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్ లలో చాలా బాధ్యతాయుతంగా ఆడి గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలకంగా రాణించారు. ప్రారంభంలో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 5 పరుగులకే వెనుదిరిగిన కెప్టెన్ పాండ్యా.. తో పాటు ఓపెనర్ శుబ్ మాన్ గిల్ క్రిజ్ లో నిలకడగా ఆడి.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. గిల్ చివరి వరకు ఆడి 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక పాండ్య 34 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుటయ్యారు.
ఆ తరువాత మిల్లర్ 32 పరుగులతో నాటౌట్ గా ఆఖరివరకు ఆడుతూనే గుజరాత్ టైటాన్స్ గెలుపు తీరాలకు చేర్చడం జరిగింది. ఈ పరిణామంతో రాజస్థాన్ రాయల్స్ రెండోసారి ఫైనల్ కి చేరుకొని కొద్దిపాటి తేడాతో కప్పు కోల్పోయింది. దీంతో గెలిచినా గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీతో పాటు 20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇదే సమయంలో రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కగా.. క్వాలిఫైయర్ 2 లో మ్యాచులో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ టీంకి 6.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సొంతం కావడం జరిగింది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…